Wednesday, May 1, 2024

సగానికి పైగా తగ్గిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు

తప్పక చదవండి

న్యూ ఢిల్లీ : ఇంజినీరింగ్‌ చివరి ఏడాది విద్యార్థులు ఉద్యోగాల కోసం మరి కొన్ని నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు తప్పేలా లేవు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రై వేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్లేస్‌మెంట్లు 50`70 శాతం తగ్గిపోయాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో నూతన ఉద్యోగుల నియామకంలో ఐటీ కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆ టోమొబైల్‌, ఏరోనాటిక్స్‌, బయో టెక్నాలజీ, బయో మెడికల్‌ సైన్స్‌, ఎలక్టాన్రిక్స్‌ అండ్‌ కమ్యూనికే షన్స్‌ తదితర విభాగాల్లోనూ రిక్రూట్‌మెంట్‌ తగ్గిపోయిందని కాలేజీలు చెప్తున్నాయి. దీంతో దేశీయ కంపెనీల రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ల కోసం ప్రయత్నించాలని అమిటీ యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ సారి ప్లేస్‌మెంట్ల పరిస్థితి నిరాశనకంగా ఉందని కేఎల్‌ యూనివర్సిటీ సీనియర్‌ ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ శరవణబాబు తెలిపారు. ఇంజినీరింగ్‌ విభాగంలో గత ఏడాది (2023 బ్యాచ్‌) తమ యూనివర్సిటీ విద్యార్థులు 80 శాతం మంది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగాలు పొందగా ఈఏడాది (2024 బ్యాచ్‌) 35 శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికయ్యారని వెల్లడిరచారు. ఫ్రెషర్ల ఎంపికలో పరిశ్రమ వర్గాలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని శారదా వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ పర్మానంద్‌ తెలిపా రు. ‘గత ఏడాది కొన్ని కంపెనీలు పరిమితికి మించి నియమించుకోవడం కూడా ఈ ఏడాది ప్లేస్‌మెం ట్లు తగ్గడానికి కారణం. చాలా కొత్త కంపెనీలు, ముఖ్య ంగా స్టార్టప్‌లు ఈ ఏడాది రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటాయి’ అని ఓకాలేజీ చీఫ్‌ ఇండస్టీ ఎంగేజ్‌మెంట్‌ ఆఫీసర్‌ అంచనా వేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు