తిరుమల : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో భట్టి మాట్లాడుతూ.. రెండు రాష్టాల్ర ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. రైతు భరోసా అమలు చేయడానికి విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని భట్టి విక్రమార్క వెల్లడిరచారు. శ్రీవారి ఆశీస్సులు నిత్యం తెలుగు రాష్టాల్రపై ఉండాలని తెలంగాణ మంత్రి భట్టి విక్కమార్క తెలిపారు. తెలంగాణ ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని ప్రశంసించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీ నెరవేరుస్తామన్నారు. దేశంలో ఎవరూ ఉచిత కరెంట్ ఆలోచన చేయని రోజుల్లోనే వైఎస్ ఆర్ అమలు చేశారని ప్రశంసించారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పెటెంట్ అని భట్టి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ 64 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సేవలందిస్తున్నారు.