Thursday, May 2, 2024

రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్‌ శర్మ

తప్పక చదవండి
  • భజన్‌ లాల్‌ పేరును ప్రతిపాదించిన వసుంధరా రాజే
  • ఖరారు చేసిన కేంద్ర బీజేపీ అధిష్టానం
  • ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సీఎం పీఠం

జయపుర : రాజస్థాన్‌ ముఖ్యమంత్రిపై సస్పెన్స్‌ ఎట్టకేలకు వీడిరది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా భజన్‌ లాల్‌ శర్మను ఎన్నుకున్నారు. రాజధాని జైపూర్‌లో జరిగిన బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో భజన్‌ లాల్‌ శర్మను బీజేపీ ఎల్పీగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం వసుంధర రాజే.. భజన్‌ లాల్‌ పేరును ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపారు. దాంతో రాజస్థాన్‌ తదుపరి ముఖ్యమంత్రి గా భజన్‌ లాల్‌ శర్మ త్వరలో ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దాదాపు 9 రోజుల తర్వాత రాజస్థాన్‌ సీఎం పేరు ఖరారుచేశారు..రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్ష్‌కి బీజేపీకి తొమ్మిదిరోజుల తర్వాత తెరదించింది. కొత్త సీఎంగా భజన్‌లాల్‌ శర్మ పేరును ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్‌ సింగ్‌, సరోజ్‌ పాండే, వినోద్‌ తవాడే సమక్షంలో జరిగిన సీఎల్‌పీ సమావేశానంతరం ఏకగ్రీవంగా భజన్‌లాల్‌ పేరును ప్రకటించారు. సంగనేర్‌ నియోజకవర్గం నుంచి భజన్‌లాల్‌ శర్మ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 56 ఏళ్ల శర్మ ఏబీవీపీలో తొలుత పనిచేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా మూడుసార్లు పనిచేసి బీజేపీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి మాజీ సీఎం వసుధరా రాజే, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, అశ్విని వైష్ణవ్‌, కైలాష్‌ చౌదరి, దియా కుమారి, అనిత్‌ భదేల్‌ పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భజన్‌లాల్‌ శర్మ పేరును ఖరారు చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 199 స్థానాలకు 115 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు