Friday, May 3, 2024

బెంగళూలో అర్ధరాత్రి ప్రాణభయంతో పరుగులు

తప్పక చదవండి

బెంగళూరు : ఓ వ్యక్తి ప్రాణభయంతో పరుగు లు తీస్తుండగా వెనుకే ఓ స్కార్పియో వాహనం అతడిని తరుముతోంది. చివరికి అతడిని బలంగా ఢీకొట్టి అంతే వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాధితుడు ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరు నగరంలోని పులకేశి నగర్‌లో అక్టోబర్‌ 18వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అందరూ చూస్తుండగానే జరిగిన దారుణమిది. మృతుడిని అస్గర్‌గా గుర్తించిన పోలీసులు, సాధారణ రోడ్డు ప్రమాద కేసుగా భావించారు.అయితే, మృతుడి స్నేహితుడిచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు అవ్రిూన్‌, అతడి వెంట ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బు వివాదం కారణంగానే తావిూ పనికి పూనుకున్నట్లు వారు అంగీకరించారు. దీంతో ముగ్గురిపైనా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అస్గర్‌ సెకండ్‌ హ్యాండ్‌ కార్‌ డీలర్‌ కాగా, అతడి వద్ద అవ్రిూన్‌ కారు కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి అతడు అస్గర్‌కు రూ.4 లక్షలు బకాయి పడ్డాడు. దీనిపై ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. అస్గర్‌ తనపై దాడి చేశాడంటూ అవ్రిూన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు వెనక్కి తీసుకోవాలని అస్గర్‌ కోరగా అవ్రిూన్‌ నిరాకరిస్తున్నాడు. ఘటన జరిగిన రాత్రి మాట్లాడు కుందాం రమ్మని అస్గర్‌ను అవ్రిూన్‌ పిలిచాడు. చెప్పినచోటుకు రాగానే ప్లాన్‌ ప్రకారం అతడిని కారుతో ఢీకొ ట్టి చంపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో ఈ ఘటన ఆ సాంతం వీడియో తీశాడని పోలీసులు చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు