Sunday, April 28, 2024

మధ్య నైజీరియాలో మరో నరమేధం..

తప్పక చదవండి
  • 160 మంది మృతి, 300 కుపైగా గాయాలు

సాయుధ మూకల అరాచక దాడులతో వణికిపోతున్న నైజీరియాలో మరో దారుణం వెలుగుచూసింది. ఆయుధాలతో బంధిపోట్లు గ్రామాలపై విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని కాల్చిపడేశారు. పలు గ్రామాల్లో బంధిపోట్లు నరమేధం సృష్టించారు. గ్రామాలపై దాడులు చేస్తున్న బంధిపోట్ల కాల్పుల్లో ఇప్పటివరకు మొత్తం 160 మంది మృత్యువాత పడినట్లు స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. బండిట్స్‌గా పిలిచే సైనిక గుంపులు.. కొన్ని తెగలకు చెందిన ప్రజలను లక్ష్యంగా చేస్తూ దాడులు చేస్తున్నారు.

ఇక మధ్య నైజీరియా, వాయవ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇళ్లలోకి చొరబడి ప్రజలను తీవ్ర చిత్రహింసలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో మొదట 16 మంది మాత్రమే మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన బంధిపోట్లు.. మారణకాండ సృష్టించారు. సోమవారం కూడా దాడులు కొనసాగడంతో మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగి పోయింది. దీంతో మొత్తం 160 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనలో మరో 300 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు