Monday, May 6, 2024

ఆర్థిక సాయం కోరాం…

తప్పక చదవండి
  • పెండింగ్ నిధులు విడుదల చేస్తేనే మనుగడ సాధ్యం
  • పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా
  • స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐఐఎం, సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయండి
  • ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్‌ రెడ్డి
  • డిప్యూటీ భట్టితో కలసి ప్రధానితో సమావేశం
  • రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు వెల్లడి
  • సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ
  • భేటీ వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం

న్యూఢిల్లీ :

తెలంగాణ అభివృద్దికి సహకరించాల్సిందిగా ప్రధాని మోడీని సిఎం రేవంత్ రెడ్డి కోరారు. నిధులు విడుదల చేసి ఆదుకోవాలని అన్నారు. ఈ మేరకు డిప్యూటి సిఎం భట్టి విక్రమార్కతో కలసి ఆయన ఢిల్లీలో ప్రధానిని ఆమన నివాసంలో కలుసుకుని వినతిపత్రం సర్పించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోడీని రేవంత్‌ రెడ్డి కలిశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పాత బకాయిలు, పెండింగ్ లో ఉన్న బిల్లులపై చర్చించారు. రేవంత్‌ రెడ్డి చెప్పిన వాటిని తప్పకుండా అమలు చేస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. విభజన హామీకి సంబంధించిన పెండిరగ్‌ నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల మంజూరు కోసం కేంద్రాన్ని అభ్యర్థించారు. రాష్ట్ర పురోగతికి అవసరమైన విన్నపాల జాబితా పట్టుకుని రేవంత్‌, విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు రాష్టాన్రికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లు, పెండిరగ్‌ నిధుల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్టాన్రికి నిధులు రావాల్సి ఉంది. ఈ పథకం కింద హైదరాబాద్‌ మినహా అప్పటి ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు 50 కోట్ల చొప్పున 450 కోట్లు రావాల్సి ఉంది. గత మూడేళ్లకు సంబంధించి 1,350 కోట్ల రూపాయల గ్రాంటు పెండిరగ్‌లో ఉన్నాయి. వీటిని విడుదల చేయాలని ప్రధాని మోడీని, సీఎం రేవంత్‌ కోరినట్లు తెలుస్తోంది.
ఈ భేటీ తర్వాత సాయంత్రం ఢిల్లీలో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు. అలాగే హైదరాబాద్‌ కు ఐటీఐఆర్‌, వెనుబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐఐఎం, సైనిక్‌ స్కూల్‌ వంటివాటిని మంజూరు చేయాలని ప్రధానిని కోరినట్లుగా భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వివరాలను ప్రధానికి వివరించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం తొలిసారి ప్రధాని మోడీని కలిశామని, తమ వినతులపై ప్రధాని సానుకూలంగా స్పందించారని భట్టి విక్రమార్క వివరించారు. బీఆర్‌ఎస్‌ చేసిన అప్పుల నుంచి బయట పడడం కోసం పెండింగ్‌లో ఉన్న నిధులను ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. నీళ్లునిధులు నియామకాల విషయంలో గత రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసిందని అన్నారు. పదేళ్లు పాలన చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేసిందని ఆరోపించారు. ఆ లోటు నుంచి భర్తీ అవడం కోసం వెంటనే కేంద్రం నుంచి గ్రాంట్లను విడుదల చేయాలని ప్రధానిని కోరినట్లు భట్టి చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిశామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించామని తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. విభజన చట్టం ప్రకారం ఒక మేజర్‌ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని అడిగామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుకు మంజూరు చేయాలని కోరామన్నారు. తెలంగాణకు ఐఐఎం సైనిక్‌ స్కూల్‌ మంజూరు చేయాలని అడిగామని చెప్పారు. బిఆర్‌ఎస్‌ నేతల ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిందన్నారు. అప్పుల్లో కూరుకున్న తెలంగాణకు.. ఆర్థిక సాయం చేయాలని ప్రధానిమంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేవామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు