Friday, May 3, 2024

సేవ చేసేవారంతా రాజకీయాలు చేయాలని లేదు..

తప్పక చదవండి
  • కానీ రాజకీయం చేసేవారంతా కచ్చితంగా సేవ చేయాల్సిందే…..
  • బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
  • ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు పోతున్న నాయకుడు..

షాద్ నగర్ : సేవ చేసేవారంతా రాజకీయాలు చేయాలని లేదు కానీ, రాజకీయం చేసేవారంతా కచ్చితంగా సేవ చేయాల్సిందే అనే నినాదంతో ముందుకు పోతున్నారు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి.. షాద్ నగర్ పట్టణానికి చెందిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలతో మమేకమయ్యాడు. ఆయన విద్యావంతుడు, పారిశ్రామికవేత్త.. పాలమూరు కాటన్ మిల్లుకు, పాలమూరు జర్నీగ్ మిల్లుకు చైర్ పర్సన్ కూడా.. అయితే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఆయన రాజకీయాలు వైపు అడుగులు వేశారు.. ఒక మామూలు కార్యకర్త స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యేకు పోటీ చేయగల స్థాయి వరకు ఎదగడంలో ఆయన కృషి, పట్టుదల ఎంతో ఉంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఖర్చు చేయనంత డబ్బును పాలమూరు చారిటబుల్ ట్రస్టు ద్వారా పేద ప్రజల సంక్షేమానికి వినియోగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 28 సంక్షేమ కార్యక్రమాలతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి, షాద్ నగర్ నియోజకవర్గంలోని ప్రజలతో శభాష్ అనిపించుకున్నాడు.. ఆయన ఈ పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ను నెలకొల్పడానికి ముఖ్య ఉద్దేశం అయన స్వగృహంలో కుటుంబ సభ్యులకు కరోనా సోకి అందరూ కోలుకున్న కానీ విష్ణువర్ధన్ రెడ్డి మాతృ మూర్తిని కరోనా తీవ్ర ఇబ్బంది పెట్టింది.. దీని వల్ల విష్ణువర్ధన్ రెడ్డి వారి అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఇంటి వద్ద ట్రీట్మెంట్ చేయించారు.. ఆమెకు ఇంట్లోనే నయం కావడం వల్ల. ఒకవేళ ఆసుపత్రిలో వైద్యం చేయించినట్లయితే లక్షల రూపాయలు ఖర్చయ్యేవని కరోనా లాంటి భయంకరమైన పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి వారికి ఇంత ముద్ద దొరకడమే కష్టమైన రోజులని, మా పరిస్థితులే ఇలా ఉంటే బయట పేదవారి పరిస్థితి ఎలా ఉందో అనే ఆలోచన నుంచే ఈ పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అంకురార్పణ జరిగినట్లు ఆయన చెబుతుంటారు.. ఆ రోజు వరకు ఇంట్లో ఉన్న డబ్బులకు మరికొంత డబ్బును సమాకూర్చి, అప్పటికప్పుడు ఈ సమాజానికి కొంతైనా సేవ చేయాలనే ఉద్దేశంతో పాలమూరు ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అంటారు..

పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పడినప్పటినుండి ఇప్పటి వరకు 28 కార్యక్రమాలతో విజయవంతం గా కొనసాగుతుండడం విశేషం..

  1. నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకొని కరోనా సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి, రామాదేవి దంపతులు షాద్ నగర్ లోని పారిశుధ్య కార్మికుల సేవలు గుర్తించి, వారికి పాదపూజ చేసి వస్ర దానం చేయడం జరిగింది..
    2 నియోజకవర్గం లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, వారికి పాలమూరు ట్రస్ట్ ద్వారా కరోనా సమయంలో కరోనా కిట్లతో పాటు వారికి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందించడం జరిగింది.
  2. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న షాద్ నగర్ నియోజకవర్గంలోని పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని వారికి నిత్యావసర సరుకులతో పాటు వారికి అన్నధాన కార్యక్రమం నిర్వహించి ఆదుకోవడం జరిగింది.
  3. షాద్ నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లోకి వచ్చే రైతులకు ప్రతి రోజు అన్నధానం నిర్వహించి రైతులకు కడుపు నింపిన గొప్ప వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి..
  4. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్బంగా ఒక వెయ్యి గణేష్ మండపాలకు అన్నదానం కొరకు బియ్యం వితరణ చేయడం నేటికీ కూడా జరుగుతోంది..
  5. నమో ఆరోగ్య మస్తు ద్వారా షాద్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది.
  6. నమో మాతృమూర్తి ద్వారా నియోజకవర్గం లోని గర్భిణీ స్రీలకు, బాలింతలకు మంచి ప్రోటీన్ ఫుడ్ అందించాలని 13, 800 మందికి ప్రోటీన్ డబ్బాలను స్వయంగా గ్రామ గ్రామాన తిరిగి అందించిన వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి..
  7. నమో అమృత పానం ద్వారా వేసవి కాలం లో 60రోజులపాటు నియోజకవర్గం లోని రెండు వందల పోలింగ్ బూత్ లలో రోజుకు అరవై వేల గ్లాసుల అంబలి పంపిణీ చేయడం జరిగింది.
  8. షాద్ నగర్ నియోజకవర్గంలోని యువతీ యువకులకు వివిధ కంపనీల ద్వారా రెండు విడతలుగా జాబ్ మేళాలు నిర్వహించి 1208 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది.
  1. గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు క్రికెట్ పోటీలు నిర్వహించి నగదు ప్రోత్సహక బహుమతులు ఇచ్చి, 500 క్రికెట్ కిట్లు, టీ షర్ట్స్ పంపిణీ చేయడం జరిగింది.
  2. షాద్ నగర్ నియోజకవర్గంలోని వేల మంది పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందజేయడం జరిగింది.
  3. వికలాంగుల కు ఉచితంగా 20 మందికి ట్రై సైకిళ్ల పంపిణి చేయడం జరిగింది.
  4. అదేవిదంగా నియోజకవర్గం లోని పేద మహిళలకు ఉచితంగా 50 మంది మహిళలకు కుట్టు మిషన్ లు అందజేయడం జరిగింది.
  5. అకాల వర్షాల వల్ల ఇండ్లు కూలిపోయిన వారికి నియోజకవర్గం లోని 50 ఇండ్లకు 5 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
  6. షాద్ నగర్ నియోజకవర్గం లోని ఎవరైనా పేదవారు అకాల మరణం పొందిన వారికి 50 కుటుంబాలకు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందించారు.
  7. షాద్ నగర్ నియోజకవర్గం లోని ఫరూఖ్ నగర్ మండలం బుచ్చిగుడాలోని ఇల్లు లేని యువకుడికి ఇల్లు కట్టించి గృహప్రవేశం చేయించిన వారు విష్ణువర్ధన్ రెడ్డి, రామాదేవి దంపతులు..
  8. నమో యువరక్ష ద్వారా షాద్ నగర్ నియోజకవర్గం లోని డ్రైవింగ్ లైసెన్స్ లేని యువతీ, యువకులకు ఉచితంగా 10 వేల మందికి లైసెన్స్ ఇవ్వడం జరిగింది.
  9. ప్రాణ రక్షణ కోసం నమో సురక్ష ద్వారా 20 వేల మంది వాహన దారులకు ఉచితంగా హెల్మెట్ అందివ్వడం జరిగింది.
  10. విష్ణు అన్న రాఖీ రక్ష కానుక కార్యక్రమం ద్వారా షాద్ నగర్ నియోజకవర్గం లోని 1 లక్షా 6 వేల మహిళలందరికి విష్ణువర్ధన్ రెడ్డి విష్ణు అన్న రాఖీ కానుక ద్వారా మహిళలకు పసుపు, కుంకుమ, ఒక రాఖీ ఒక చీర బ్యాగ్ అందించడం జరిగింది.
  11. నమో సేవలాల్ శుద్ధ జలం అనే కార్యక్రమం ప్రారంభించి స్వచ్ఛ మైన మంచినీరు త్రాగాలని షాద్ నగర్ నియోజకవర్గం లోని 50 గిరిజన తాండాల్లో 50 వాటర్ ప్లాంట్ లు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది.
    ఇలా సేవ చేస్తూ.. ఎప్పుడూ ప్రజలతో మమేకమై తిరుగుతూ పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు ఆయన చెప్పారు.. ఆ దేవుడి దయ, ప్రజల సహాయ సహకారాలు ఉంటే రాబోయే కాలంలో మంచి రాజకీయ నేతగా ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అన్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు