Tuesday, May 14, 2024

కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ప్రమాదం

తప్పక చదవండి
  • భక్తుల హాహాకారాలతో ఘటనాస్థలిలో భయానక పరిస్థితి
  • వాహనంలో 13 మంది ప్రయాణికులు
  • ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు

బాధితులు నంద్యాల జిల్లా గాజులపల్లికి చెందిన వారు ఏపీలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. నంద్యాల జిల్లా గాజుపల్లి గ్రామానికి చెందినవారు బొలేరో వాహనంలో కోటప్పకొండకు చేరుకుని గుడివద్దకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొండపైకి వెళ్లే క్రమంలో ఘాట్ రోడ్డుపై అదుపుతప్పిన వాహనం బోల్తాపడింది. దీంతో భక్తులు గాయాలపాలయ్యారు. నంద్యాల సమీపంలోని గాజులపల్లికి చెందిన ఓ కుటుంబం ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాలను చుట్టివచ్చేందుకు తీర్థయాత్ర చేపడుతోంది. ఇలా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఈ కుటుంబం దర్శించుకుంది. అక్కడినుండి పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని మరో ఆద్యాత్మిక కేంద్రం కోటప్పకొండకు చేరుకున్నారు. త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కోటప్పకొండపైకి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘాటురోడ్డుపై అదుపుతప్పిన బొలేరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 13 మందితో పాటు వంట సామగ్రి, బ్యాగులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరైన సమయానికి వైద్యం అందడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. కాగా ఈ యాక్సిండెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. హాస్పిటల్లో చికిత్స పొందతున్న క్షతగాత్రులతో పాటు మిగతా బాధితుల నుండి ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు