Monday, April 29, 2024

యూఎస్‌లో రికార్డుస్థాయిలో భారత విద్యార్థులు

తప్పక చదవండి
  • భారత్ నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాకు విద్యార్థులు
  • 15 ఏళ్ల తర్వాత మొదటిసారి టాప్‌లో భారతీయులు
  • మూడేళ్ల నుంచి క్రమంగా తగ్గుతున్న చైనీయులు
  • ఓపెన్ డోర్స్ తాజా రిపోర్టులో వెల్లడి

ఉన్నత విద్య కోసం అమెరికా ఫ్లైటెక్కుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది రికార్డు సంఖ్యకు చేరింది.
2022-23 విద్యా సంవత్సరంలో ఏకంగా 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో అడుగుపెట్టారు. ఈ ఏడాది అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య 10,57,188 కాగా అందులో 2,89,526 మంది విద్యార్థులతో చైనా టాప్ లో ఉండగా ఎప్పట్లానే భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ విద్యా సంవత్సరంలో అమెరికాలో అడుగుపెట్టిన ప్రతీ నలుగురు విదేశీ విద్యార్థులలో ఒకరు మన భారతీయులే ఉండడం విశేషం. అన్ని దేశాల నుంచి వచ్చిన దాదాపు 10 లక్షల మందిలో వీళ్లే 26 శాతం ఉన్నారని ఓపెన్‌ డోర్స్‌ నివేదిక స్పష్టం చేసింది. అమెరికాలో విదేశీ విద్యార్థుల తాకిడి కోవిడ్-19కు ముందున్న స్థితికి చేరుకున్నట్లు తెలిపింది. అంతేకాదు, గత 40 ఏళ్లలో మొదటిసారిగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12శాతం పెరిగింది. అమెరికాలో చదువుతోన్న విదేశీ విద్యార్థుల్లో చైనీయులే అధికం. కానీ, 22-23లో వారిని భారతీయులు అధిగమించారు. భారత్ నుంచి 1.65 లక్షల మంది విద్యార్థులు వెళ్లగా.. 1.23 లక్షలతో చైనా రెండో స్థానంలో నిలిచింది. భారత్, చైనాల నుంచే 53 శాతం మంది అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్లు ఉండటం గమనార్హం. 2009-10 తర్వాత తొలిసారిగా చైనాను భారత్‌ అధిగమించిందని నివేదిక తెలిపింది. భారతీయ విద్యార్థులు 63% పెరిగి 1,65,936కి చేరుకున్నట్టు వెల్లడించింది. అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇదే సమయంలో గత మూడేళ్లుగా చైనా నుంచి వెళ్లేవారు తగ్గుతున్నారు. తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్‌, నైజీరియా ఉన్నాయి. సోమవారం విడుదల చేసిన ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం, 2.68 లక్షల మంది భారతీయ విద్యార్థులు గత సంవత్సరం అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో చదువుతున్నారు. ఇందులో ఎఫ్-1 లేదా స్టూడెంట్ వీసాతో విదేశీ గ్రాడ్యుయేట్‌లను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లలో చేరినవారు ఉన్నారు. ఈ వీసా వల్ల మూడేళ్ల వరకు చెల్లింపు లేదా స్వచ్ఛందంగా పని చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది 2021-22లో నమోదైన 1.99 లక్షల మంది విద్యార్థుల కంటే 35 శాతం ఎక్కువ. గత 23 ఏళ్లలో మొదటిసారి రెట్టింపయ్యింది. ఈ మైలురాయి అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల కూర్పులో గణనీయమైన మార్పును కూడా సూచిస్తుంది. 2012-13లో 12 శాతంగా ఉన్న భారత్ వాటా 2022-23లో 25 శాతానికి పెరిగింది. 27 శాతంగా ఉన్న చైనీయుల కంటే కేవలం రెండు శాతం తక్కువ. కానీ, దశాబ్దం కిందట చైనా వాటా 31 శాతం. కాగా, అమెరికాలో ఉన్నత విద్యకోసం వెళ్తోన్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, బిజినెస్‌ విభాగాల్లోనే చేరుతున్నారు. కొంతకాలంగా ఈ ప్రోగ్రాంలలో 21 శాతం పెరుగుదల నమోదుకాగా.. అండర్‌ గ్రాడ్యుయేట్‌లలో ఒక శాతం పెరిగింది. గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రాంలలో అత్యధిక పురోగతి చూపగా.. ఆ తర్వాత ఇంజినీరింగ్‌, బిజినెస్‌ విభాగాలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ విద్యార్థులకు గమ్యస్థానంగా ఉన్న ఇల్లినాయిస్, టెక్సాస్‌, మిచిగాన్‌ సహా 24 రాష్ట్రాల్లో చైనా కంటే భారతీయ విద్యార్థులే అధికంగా ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు