Wednesday, September 11, 2024
spot_img

ఇస్లాం మత పెద్దలతో ఇస్తేమా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

తప్పక చదవండి
  • అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

వికారాబాద్‌ జిల్లా (ఆదాబ్‌ హైదరాబాద్‌):పరిగి మండల పరిధిలో జనవరి మాసం 5,6,7 తేదీలలో నిర్వహించనున్న ఇస్లాం మత ఇస్తేమా కార్యక్రమం నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌ లో సంబంధిత అధికారులు, ఇస్లాం మత పెద్దలతో ఇస్తేమా ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు రోజుల పాటు నిర్వహించే ఇస్తేమా సభకు అవసరమైన మిషన్‌ భగీరథ నీరు, విద్యుత్తు, రోడ్ల ఏర్పాటు వాహనాలకు పార్కింగ్‌ స్థలంతో పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు.

ఇట్టి పనులు చేపట్టేందుకు మండల స్థాయి అధికారులను కూడా భాగస్వాములు చేయాలని సూచించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సోమవారం నుండి ప్రారంభించాలని సూచించారు.ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ, ఇస్తే మాకు దాదాపు 2 లక్షల మంది హాజరవుతారని, మొదటి ప్రాధాన్యతగా నీరు విద్యుత్‌ సదుపాయాలను అవసరం మేరకు కల్పించాలని కలెక్టర్‌ ను కోరారు.ఈ సమావేశంలో మిషన్‌ భగీరథ గ్రిడ్‌, ఇంట్రా ఈ ఈ లు చల్మారెడ్డి, బాబు శ్రీనివాస్‌, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌ కుమార్‌, పరిగి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌, విద్యుత్‌ శాఖ ఇంజనీర్లు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు