Thursday, May 2, 2024

మేడిపల్లిలో 510 కిలోల గంజాయి స్వాధీనం

తప్పక చదవండి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 510 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. మల్కాజ్‌గిరి ఎస్వోటీ టీమ్‌ పక్కా సమాచారంతో 510 కిలోలు (102 ప్యాకెట్‌లు) గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, సరుకుతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు అదే వాహనంలో పలుమార్లు అక్రమంగా గంజాయి తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం రాచకొండ సిపి సిపి డిఎస్‌ చౌహాన్‌ మీడియాతో సమావేశం నిర్వహించి గంజాయి ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడిరచారు. రాచకొండ, మల్కాజిగిరి ఎస్వోటి టీమ్‌ పక్కా సమాచారంతో 510 కిలోలు (102 ప్యాకెట్‌ లు) గంజాయిని అక్రమంగా తరలిస్తున్న మనోహర్‌, ప్రవీణ్‌ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని గంజాయితో పాటు ఓ వాహన్నన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మార్కెట్‌లో స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయిలు ఉంటుందని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మనోహర్‌, ప్రవీణ్‌ అనే వ్యక్తులు.. హైదరాబాద్‌ మీదుగా ఒరిస్సా నుండి హర్యానా హిస్సార్‌ కు గంజాయిని తరలించేందుకు ప్రయత్నించారని తెలిపారు. గంజాయి రవాణాకు ట్రాన్స్‌పోర్ట్‌ ఆటలో సీక్రెట్‌ పార్టీషన్‌ ఏర్పాటు చేసి తరలిస్తుండగా.. మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు