Monday, May 6, 2024

ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా రూ. 4,04,000 నగదు సీజ్..

తప్పక చదవండి
  • వివరాలు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్

హైదరాబాద్ : ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా రూ. 4,04,000 నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఇప్పటివరకు 1,04,12,250 నగదును సీజ్ చేశారు. పోలీస్ అథారటీ ద్వారా 16,64,143 సీజ్ చేయగా ఇప్పటివరకు 35,45,12,858 నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఎఫ్.ఐ.ఆర్ లు 19 నమోదు కాగా ఇప్పటి వరకు 224 నమోదు చేయడం జరిగిందని తెలిపారు. 

లా అండ్ ఆర్డర్ కింద లైసెన్స్ ఆయుధాలను ఈ రోజు 85 సేకరించగా ఇప్పటి వరకు 4,249 ఆయుధాలను సేకరించడం జరిగింది. సి.ఆర్.పి.సి కింద నేడు 60 కేసులు ఉండగా ఇప్పటి వరకు 393 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 165 బైండోవర్ చేయగా ఇప్పటి వరకు 1081 బైండోవర్ చేయడం జరిగింది. 76 నక్కాస్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 568 నక్కాస్ కేసులు నమోదయ్యాయి. నేడు నాన్ బెయిలబుల్ వారంట్ 58 కాగా మొత్తం 472 కేసులు నమోదయ్యాయి. 

- Advertisement -

ఎం.సి.సి ఉల్లంఘన కింద నేడు పబ్లిక్ ప్రాపర్టీస్ లో శుక్రవారం 62 వాల్ రైటింగ్ తొలగించగా ఇప్పటివరకు 5,031 వాల్ రైటింగ్స్ ను తొలగించడం జరిగింది. నేడు 1401 పోస్టర్లను తొలగించగా మొత్తం 66,331 పోస్టర్లను తొలగించడం జరిగింది. నేడు 485 బ్యానర్లను తొలగించగా ఇప్పటి వరకు 21,049 బ్యానర్లను తొలగించడం జరిగింది. నేడు పబ్లిక్ ప్రాపర్టీలలో 1,469 రాజకీయ నాయకుల విగ్రహాలకు మాస్కులు వేయడం జరిగింది. ఇప్పటి వరకు 71,671 విగ్రహాలకు మాస్కులు వేయడం జరిగింది. 

ప్రైవేట్ ప్రాపర్టీలలో నేడు 48 వాల్ రైటింగ్ లను తొలగించగా ఇప్పటి వరకు 1,135 వాల్ రైటింగ్ లను తొలగించడం జరిగింది. నేడు 244 పోస్టర్లను తొలగించగా ఇప్పటి వరకు 18,346 పోస్టర్లను తొలగించారు. నేడు 72 బ్యానర్లు తొలగించగా ఇప్పటి వరకు 4,057 బ్యానర్లను తొలగించడం జరిగింది. నేడు 292 రాజకీయ నాయకుల విగ్రహాల పై మాస్కులు వేయడం జరిగింది. ఇప్పటి వరకు 19,571 విగ్రహాలకు మాస్కులు వేయడం జరిగింది. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు ఇప్పటి వరకు 8 నిర్వహించడం జరిగింది. ఎఫ్.ఐ.ఆర్ ఇప్పటి వరకు మొత్తం 8 నమోదయ్యాయి. ఎక్సైజ్ శాఖ ద్వారా నేడు 348 లీటర్ల లిక్కర్ ను సీజ్ చేయడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు