Sunday, May 19, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన

తప్పక చదవండి
  • అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, డిసిఎస్‌ఓ వెంకటేశ్వర్లు డిఎం నాగేశ్వరరావు

మిర్యాలగూడ : వానాకాలం 2023-24 సీజన్‌ కు సంబందించి మాడుగుల పల్లి మండలంలోని పిఏసిఎస్‌ బొమ్మకల్‌, సల్కునూరు, కేంద్రాలను బుధవారం నల్గొండ అదనపు కలెక్టర్‌ జె శ్రీనివాస్‌ , పౌరసరఫలాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ నాగేశ్వరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం 2023-24 సీజన్‌ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 191 కేంద్రాలను ప్రారంభించినట్లు అన్ని కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 48,017 మంది రైతుల నుండి 302158, వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.598.00 కోట్ల డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసినట్టు తెలియజేశారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల ఇన్చార్జులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ట్యాబ్‌ ద్వారా ఎంట్రీ చేసి రైతులకు త్వరితగతిన డబ్బులు అందేలా చేయాలని తెలిపారు ఇన్చార్జికి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతం రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవనంలో మిల్లర్స్‌ సమావేశాన్ని నిర్వహించారు.ఈ జిల్లాలో వానకాలం 2002 -23 సంవత్సరాలు సంబంధించి కష్టం మిల్లింగ్‌ ధాన్యాన్ని జిల్లాలోని రైస్‌ మిల్లర్స్‌ కి 298723 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం పంపగా దాని నిమిత్తం ఈ జిల్లాలోనే రైస్‌ మిల్లర్స్‌ ప్రభుత్వానికి సీఎంఆర్‌ బియ్యం దిగుమతి 274195 మెట్రిక్‌ టన్నుల 92 శాతం చేశారని, మిగిలిన 8 శాతం సీఎంఆర్‌ బియ్యం ను త్వరగా దిగుమతి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డిఓ బి చెన్నయ్య, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్‌, మిర్యాలగూడ డి టి సి ఎస్‌ జావిద్‌ ఆర్‌ ఐ సురేందర్‌ సింగ్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గౌరవ శ్రీనివాస్‌ కార్యదర్శి వెంకటరమణ చౌదరి, ఉపాధ్యక్షులు అశోక్‌ రెడ్డి తదితరులు మిల్లర్లు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు