Saturday, April 27, 2024

జోరుగా బీజేపీలోకి వలసలు

తప్పక చదవండి
  • బీసీ సీఎం ప్రకటన తో భారీగా వలసలు
  • బీజేపీలోకి చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు
  • సూర్యాపేట జిల్లా అభివృద్ధి సంకినేని వెంకటేశ్వరరావు తోనే సాధ్యమని నమ్మి వస్తున్న ఇతర పార్టీల కార్యకర్తలు
  • దాసాయిగూడెం శాంతినగర్ గ్రామాల నుంచి భారీగా బీజేపీ లో చేరిన బీఆర్ఎస్, కార్యకర్తలు

సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గం అభివృద్ధి సంకినేని వెంకటేశ్వరరావు తోనే సాధ్యమని నమ్మి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు రాజీనామాలు చేసి బిజెపిలో చేరుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి బీసీ సీఎం అభ్యర్థిగా ప్రకటన చేయడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామాలు చేసి బిజెపిలో చేరుతున్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో, సూర్యాపేట నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు సమక్షంలో దాసాయిగూడెం శాంతినగర్ గ్రామాలకు చెందిన విఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేసి సంకినేని వెంకటేశ్వరరావు సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ప్రాముఖ్యత ఇస్తున్న ఏకైక పార్టీ బిజెపి అన్నారు .బిజెపితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ పార్టీలను వీడి బిజెపిలో చేరుతున్నారని అన్నారు. ఎన్నికల నాటికి
సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు ఖాళీ అవుతాయని ఆయన అన్నారు. అనంతరం టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలకు బిజెపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిజెపిలో చేరిన వారిలో దాసాయిగూడెం శాంతినగర్ గ్రామాలకు చెందిన
బస్క శ్రీనివాస్ (మాజీ నీటి సంఘం డైరెక్టర్), ఇట్టమల్ల వెంకన్న (మాల మహానాడు జిల్లా నాయకులు ),
వాంకుడోత్.కృష్ణ, పాడేటి లింగయ్య యాదవ్ ,బుషిగంపల లక్ష్మయ్య గౌడ్, బుషిగంపల సత్యం గౌడ్ , బుశిగంపల మధు గౌడ్, భుశి గంపల ఉపేందర్ గౌడ్, గుండెపోయిన,లింగరాజు యాదవ్, అమర గాని పెద్ద ఉపేందర్ గౌడ్ ,సిరిమల్లె శేఖర్ గౌడ్, అమర గాని ఉపేందర్ గౌడ్, చంద్రమౌళి గౌడ్, షేక్ చాంద్ పాషా, బత్తిని జాని గౌడ్,జనీగ విజయ్ యాదవ్, పెరుమళ్ళ శ్రీను తదితరులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు