Thursday, May 16, 2024

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ది

తప్పక చదవండి
  • అయోధ్యలో రామాలయం బిజెపి ఘనతే
  • కాగజ్‌నగర్‌ సభలో యూపి సిఎం యోగి

కొమురం భీం : ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. బీజేపీ ఇలాంటి వాటికి వ్యతిరేకమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌ నగర్‌ పట్టణంలోని గ్రౌండ్‌ లో శనివారం ఏర్పాటు చేసిన రామరాజ్య స్థాపన సంకల్ప సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గోన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే బ్రష్టాచార్‌ రిష్వత్‌ కోర్‌ సమితి అంటూ వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 2017 కంటే ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎలా ఉండేదో అందరికీ తెలుసని.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చాక ఒక్క రోజు కూడా అల్లర్లు జరిగిన సందర్భం లేదన్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పేపర్‌ లీకేజీల జరుగుతున్నాయని అన్నారు. మోడీ 10 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారని.. 6 లక్షలు ఇచ్చారని.. మిగతావి పూర్తి చేస్తారని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రహస్య మిత్రులు అని.. వీరికి మధ్యలో ఎంఐఎం ఉందని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని.. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని స్పష్టం చేశారు. మోడీ నేతృత్వంలో నడుస్తున్న భారత ప్రభుత్వంపై ఏ దేశం కూడా కన్నెత్తి చూడలేదన్నారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే రామ మందిరం నిర్మాణం జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ , బీఎస్పీ అందరి ఎజెండా ఒక్కటే అని చెప్పారు. సొంత రాష్ట్రం అయిన యూపీలోనే బీఎస్పీకి కేవలం ఒక సీటు మాత్రమే ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు.
డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ తోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్య నాథ్‌ అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కాంగ్రెస్‌ పార్టీతోనో, బీఆర్‌ఎస్‌ పార్టీతోనో అయ్యేదా అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్‌ నగర్‌ కు వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కు సిర్పూర్‌ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్‌ బాబు, పార్టీ శ్రేణులు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఆపై ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న యోగి ఆదిత్య నాథ్‌ ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నా కోటి కోటి వందనాలు అని స్పీచ్‌ మొదలుపెట్టిన యూపీ సీఎం యోగి… అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ప్రస్తావించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలతో అయ్యేదా అని ప్రశ్నించారు. రామాలయం కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. సిర్పూర్‌ లో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయని, సొంత రాష్ట్రాల్లో చెల్లని బీఎస్పీ పార్టీ తెలంగాణలో చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఅర్‌ అరాచక, ఆన్యాయ పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పార్టీ పాలన ముస్లింలకు అనుకూలంగా సాగుతుందని, తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తేనే కొన్ని మతాల ఆరాచకం తగ్గుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ అంటేనే బ్రష్టా చార్‌ రిస్వత్‌ కొర సమితి అని అన్నారు. యూపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వచ్చాక కర్ఫ్యూ, ధర్నాలు లేవన్నారు. తెలంగాణలో పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని సీఎం కేసీఆర్‌, పాలన సమర్థవంతంగా ఎలా చేస్తాడని యూపీ సీఎం యోగి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కామన్‌ దోస్తు ఎంఐఎం పార్టీ అని వీరంతా కలిసి ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, ప్రతి ఇంటికి పథకాలు అందుతున్నాయని చెప్పారు. తెలంగాణలోను బీజేపీ అధికారంలోకి వస్తేనే, తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు