Monday, April 29, 2024

అనుమతి లేకుండా ధర్నాలు రాస్తారోకోలు, సభలు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు..

తప్పక చదవండి
  • హెచ్చరించిన వరంగల్, వెస్ట్ జోన్ డిసిపి పి సీతారాం..

జనగామ : జనగామ జిల్లాలో వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు గాని ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిసిపి వెస్ట్ జోన్ వరంగల్ సీతారాం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యమైన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజాశాంతికి, జనజీవనానికి ఆటంకం కలిగించరాదని, ప్రజలతో పాటు, వాహనదారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా చట్ట వ్యతిరేకంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆకస్మికంగా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు, సభలు, ర్యాలీలు నిర్వహించే, పాల్గొన్న వ్యక్తులపై చట్ట పరంగా కేసులను నమోదు చేసి తగు చర్యలు తీసుకోనబడుతాయి అని, ఏదైనా పైన తెలిపినటువంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందస్తుగా దరఖాస్తులు చేసుకొని సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారుల నుండి అనుమతులు పొంది, వారు తలపెట్టిన కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు అని అన్నారు. అదే విధంగా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేసే వారు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవడమే కాకుండా.. తలపెట్టిన కార్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని పొందు పరచవలసి ఉంటుంది.. అట్టి కార్యక్రమానికి సంబంధించి సౌండ్ సిస్టం (డిజే) లేదా బాణాసంచా కాల్చడానికి కూడా అనుమతులు తప్పనిసరి. అలా కాకుండా ఎవరైనా డీజే మ్యూజిక్ లేదా లౌడ్ స్పీకర్లు వాడినట్లయితే అవి ఏర్పాటు చేసిన సంబంధిత యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసి, వాటిని సీజ్ చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు. ఈ నిబంధనలను ఎవరు ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మా పోలీసువారి విజ్ఞప్తిని అన్ని రాజకీయ పార్టీలు, ఇతర సంఘాలు పాటిస్తారని కోరుకుంటున్నాం అని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు