Thursday, May 16, 2024

సింగపురం ఇందిరా గెలుపు.. స్టేషన్ ఘనపూర్ కు ఒక మలుపు…

తప్పక చదవండి
  • జీడికల్ ఆలయంలో ప్రత్యేక పూజలు.

లింగల ఘన్పూర్ : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ సింగపురం ఇందిరా ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలువాలని జీడికల్ శ్రీ వీరాచల శ్రీరామచంద్రస్వామి ఆలయంలో లింగలఘన్పూర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.. ఈ సందర్భంగా కొల్లూరి శివకుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగరాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఆరు పథకాలను గడపగడపకు చేరాలని, దానికి మనమందరం కృషి చేయాలని, పార్టీ ఆదేశాల మేరకు మనం పని చేయాలని కార్యకర్తలకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిసరా దిలీప్ రెడ్డి, జిల్లా నాయకుడు పోరెడ్డి మల్లారెడ్డి, బిట్ల బాబు, అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ బస్వాగని అనిల్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిటకోరు సంపత్, మహిళా కాంగ్రెస్, బుటరెడ్డి శ్రీలత రెడ్డి, ఎస్సి సెల్ మండల్ అధ్యక్షులు నర్సింగ, నవాబు పేట గ్రామశాఖ అధ్యక్షుడు బూడిద సదానందం గౌడ్, నెల్లుట్ల గ్రామశాఖ అధ్యక్షులు బత్తిని అశోక్ కుమార్ గౌడ్, లింగల ఘన్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు బుట్ రెడ్డి రాజా, రవీందర్ రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జులు దామెర నాగరాజు, మందాపురం ఉపేందర్ గౌడ్, సాదం విజయ్ మనోహర్, బొట్ల భాస్కర్, చిటుకుల వెంకటేశ్వర్లు, మండల సీనియర్ నాయకులు, గ్రామ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు