Tuesday, May 14, 2024

ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదు!

తప్పక చదవండి

వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో తాము ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదని సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ అన్నాడు. ఇప్పటికీ ఫైనల్‌ షాక్‌ నుంచి తేరుకోలేద న్నాడు. భారత జట్టు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని షమీ ఆవేదన వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓడిపోయిన విషయం తెలి సిందే. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి.. తుది మెట్టుపై బోల్తా పడడంతో భారత్‌ ఫాన్స్‌ సహా ఆట గాళ్లు ఏడ్చేశారు. తాజాగా మహమ్మద్‌ షమీ ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘భారత దేశమంతా ఓటమితో తీవ్ర నిరుత్సా హానికి గురైంది. అభిమానులు మాపై ఎన్నో అంచనాలు పెంచుకున్నారు. మేం కూడా కప్‌ను సాధించాలనే లక్ష్యం తో బరిలోకి దిగాం. వంద శాతం శ్రమించి.. ఫైనల్‌కు చేరాం. విశ్వ విజేత గా నిలవాలని కల లుగన్నాం. కానీ మా అంచనాలు తారుమారయ్యాయి. జట్టు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీ రైంది. ఫైనల్‌లో ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికీ ఫైనల్‌ షాక్‌ నుంచి తేరుకోలేదు’ అని బుధవారం ఆజ్‌ తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ చెప్పాడు. చీలమండ గా యం కారణంగా షమీ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ కు దూరమయ్యాడు. ‘ఫైనల్‌లో ఓటమి తర్వా త అందరూ మైదానం నుంచి నేరుగా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాం. ఎవరం మాట్లాడుకోలేదు. డ్రెస్సింగ్‌ రూమ్‌ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. రెండు నెలల పాటు చేసిన శ్రమ వృధా కావ డంతో నిరుత్సాహం చెందాం. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చారు. ఎవరా అని అందరం తలెత్తి చూశాం. ప్రధానిని చూసి షాక్‌ అయ్యాము. ఎందు కంటే ప్రధాని వస్తున్నారనే సమాచారం మాకు లేదు. ఆయన ప్రతి ఒక్కరి దగ్గరకూ వచ్చి ధైర్యం చెప్పారు. ఆ తర్వాతనే మేమంతా ఒకరితో మరొకరు మాట్లాడు కున్నాం’ అని మహమ్మద్‌ షమీ తెలిపాడు. ప్రపంచకప్‌ 2023లో షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు