Thursday, May 2, 2024

ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం

తప్పక చదవండి
  • మేనిఫెస్టో కమిటీ భేటీలో మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌ : ఎన్నికల ముందు ఒక మంచి మేనిఫెస్టో అందించగలిగామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం మంత్రి అధ్యక్షతన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో అన్నింటికంటే మంచి మేనిఫెస్టో ఇవ్వగలిగామన్నారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చామని.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేశామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రెండో రోజు మహిళలకు ఉచిత బస్‌ సౌకర్యం, ఆరోగ్యశ్రీలో పది లక్షల ఆరోగ్య పథకాన్ని అందించామ న్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీపై ఎంతో విశ్వాసాన్ని చూపారన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హమీలను నేరవేర్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. హమీల అమలుపై సమీక్ష చేశామని.. వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హమీ నేరవేరబోతుందన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందని విమర్శించారు. అందుకే హమీల్లో కాస్త జాప్యం నడుస్తోందన్నారు. నిరుద్యోగ భృతి మొదలుకుని డబుల్‌ బెడ్‌ రూంల వరకు అన్ని హమీలను బీఆర్‌ఎస్‌ విస్మరించిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాదన్నారు. మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడిరచారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో అక్రమాలతోపాటు చత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోపు అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇక, 200 యూనిట్ల కరెంట్‌..100 రోజుల్లో ఇచ్చి.. హామీ నిలబెట్టుకుంటాం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో దళితుణ్ణి సీఎం చేస్తా అని చెప్పిన కేసీఆర్‌ ఏం చేశాడు.. దళితుణ్ణి సీఎం చేయకపోతే మెడ మీద తల నరుక్కుంటా అన్నాడు.. 9 ఏండ్లు తల నరుక్కున్నాడా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ దోపిడీతో.. మేము ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయలేకపోయామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా అని కేసీఆర్‌ ఇవ్వలేదు.. నిరుద్యోగులను బీఆర్‌ఎస్‌ మోసం చేసింది.. పదేళ్లు వారికి ఉద్యోగాలు ఇవ్వకూండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.. ఇప్పుడు నిరుద్యోగులను కేసీఆర్‌ ఇంటికి పంపాలా.. కేటీఆర్‌ ఇంటికి పంపాలాఅని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ సర్కార్‌ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందన్నారు. కేసీఆర్‌ నిరుద్యోగ భృతి మొదలుకుని డబల్‌ బెడ్‌ రూంల వరకు అన్ని హమీలను మీరు విస్మరించారన్నారు. మేము ప్రజలను మీలాగా రెచ్చగొడితే ఫార్మ్‌ హౌస్‌ దాటకపోయే వారని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు రాదని స్పష్టం చేశారు. కాలేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతొందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు