Monday, April 29, 2024

జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం

తప్పక చదవండి
  • ఇది రాజ్యాంగ విరుద్దమన్న మమత

కోల్‌కతా : ఒకే దేశం ఒకే ఎన్నికపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌పై ఏర్పాటు చేసిన కమిటీకి టీఎంసీ తన అభిప్రాయాన్ని తెలిపింది. అసెంబ్లీ, లోక్‌ సభకు ఓకేసారి ఎన్నిక నిర్వహించడం అనేది భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని అభిప్రాయపడింది. దేశంలో తొలిసారి 1952లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓకేసారి ఎన్నిక జరిగిందని గుర్తుచేసింది. ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్‌లో సంకీర్ణ ప్రభుత్వాలు కూలడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యమైందని చెప్పుకొచ్చారు. అందుకోసమే దేశంలో ఒక్కో రాష్టాన్రికి ఒక్కోసారి జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు మళ్లీ అలా ఓకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదనతో విభేదిస్తున్నామని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో భయమేస్తుందని మమతా బెనర్జీ చెప్పారు. ప్రాథమిక మౌలిక సూత్రాలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని ధ్వజమెత్తారు. ఓకే దేశం, ఓకే ఎన్నిక అనేది నియంతృత్వానికి దారితీస్తుందని మండిపడ్డారు. తమ పార్టీ వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ను వ్యతిరేకిస్తుందని స్పష్టంచేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు