Tuesday, May 7, 2024

నిర్మాణం ఒకటి..అనుమతులు రెండు..

తప్పక చదవండి
  • ప్రభుత్వ నియమ, నిబంధనలు మాకు వర్తించవు అంటున్న అక్రమ నిర్మాణదారులు..
  • టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మౌనం వీడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..

ఎల్బీనగర్‌ : జి.హెచ్‌.ఎం.సి.ఎల్బీనగర్‌ జోన్‌లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది… సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5 పరిధిలో కొందరు అక్రమ నిర్మాణ దారులు, టి.ఎస్‌.బి.పాస్‌ నియమ, నిబంధనలు భేఖతారు చేస్తూ తమ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతన్నారు… కొత్తపేట్‌ డివిజన్‌ పరిధిలోని మారుతీ నగర్‌లో ఓ నిర్మాణ దారుడు రెండు గృహ నిర్మాణాలకు అనుమతులు తీసుకొని ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి, ఒకే నిర్మాణం నిర్మిస్తున్నాడు.. మరో నిర్మాణ దారుడు, ప్రభుత్వం నుండి రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి.. కొత్తపేట్‌ నాగోల్‌ ప్రధాన రహదారిలో అదనంగా ఒక అంతస్తు.. సెల్లార్‌, కమర్షియల్‌ భవనం నిర్మిస్తున్నాడు.. గడ్డిఅన్నారం డివిజన్‌ పరిధిలో మరో నిర్మాణ దారుడు, ప్రభుత్వం నుండి రెండు అనుమతులు విడి,విడిగా తీసుకొని… ఒకే నిర్మాణం నిర్మిస్తున్నాడు..ఇలా ఎవ్వరి ఇష్టానుసారంగా వారు .. నిర్మాణాలు నిర్మించి.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి.. అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు… ఈలాంటి అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే నోటీసులు ఇచ్చి కాలయాపన చేయడం పరిపాటిగా మారిపోయింది… ఈలాంటి అక్రమ నిర్మాణాలు పదుల సంఖ్యలో ఉన్న అధికారులు మౌనం పాటించడం దేనికి సంకేతం.. అందుకున్న చీకటి ముడుపులేనా.. అధికారులు మౌనం విడి చట్టపరమైన చర్యలు తీసు కోవాలి. టౌన్‌ ప్లానింగ్‌ విభాగం పై, అక్రమ నిర్మాణాలపై ఆదాబ్‌ హైదరబాద్‌ దిన పత్రికలో ఎన్నో కథనాలు ప్రచురించబడ్డాయి. ప్రభుత్వ నిబంధనలు, అనుమతుల మేరకు నిర్మాణాలు నిర్మిస్తే ఎవ్వరి ఒత్తిడి ఉండదు.. మరి అధికారులు ఈ కథనం పై ఏ విధంగా స్పందిస్తారో.. మరో కథనంలో చూద్దాం… ఈ అక్రమ నిర్మాణాల పూర్తి వివరాలు టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులకు ఇవ్వడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు