Saturday, May 18, 2024

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులో మోడీ కుట్ర..

తప్పక చదవండి
  • రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే…
  • వచ్చే ఎన్నికలలో 74 – 78 సీట్లు గెలవబోతున్నాం..
  • ఇచ్చిన 6 గ్యారంటీలను మొదటి 100 రోజుల్లో నెరవేరుస్తాం..
  • పత్రికా సమావేశంలో కాంగ్రెస్‌ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క..

బోనకల్‌ : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ అప్రజాస్వామికం అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులు ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహన్ని వీక్షించారు.అనంతరం మండల కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు చేబోలు వెంకటేశ్వరావు ఇంటి వద్ద పత్రిక విలేకరులతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలు ప్రతిపక్షాలను లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆ కుట్రలో భాగంగానే జగన్‌ భుజాలపై తుపాకీ పెట్టి మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు తెరలేపారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 74 నుంచి 78 సీట్లు వరకు స్నానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు.అధికారం చేపట్టిన 100 రోజుల్లో విజయభేరిలో తెలంగాణ రాష్ట్ర ప్రధాత సోనియా గాంధీ ప్రకటించిన హామీలను అమలుపరుస్తామని భట్టి విక్రమార్క అన్నారు.సంక్షేమ పథకాల గ్యారెంటీ కార్డులతో ప్రజల వద్దకు కాంగ్రెస్‌ పార్టీ వెళ్లనున్నట్లు ఆయన తెలియజేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెలా 2500తో పాటు 500 కే గ్యాస్‌ సిలిండర్‌,ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం కల్పిస్తామనిఅన్నారు.రైతు భరోసా ద్వారా ప్రతి ఏటా రైతులు,కౌవులు రైతులకు 15000 రూపాయలు వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు,వరి పంట పండిరచే వారికి 500 రూపాయలు బోనస్‌, గృహ జ్యోతి ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు దాని నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. చేయూత పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నెలకు 4 వేల పెన్షన్‌,రాజీవ్‌ ఆరోగ్యశ్రీ భీమా ద్వారా 10 లక్షల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు.ప్రతి మండల కేంద్రంలో నర్సరీ నుంచి 12 తరగతి వరకు ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ తో విద్యాలయాన్ని ఏర్పాటు చేసి వారికి నాణ్యమైన విద్యతోపాటు పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుందని, విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు మండలంలోని అన్ని గ్రామాల నుండి బస్సు సౌకర్యం కూడా తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలియజేశారు.ఎటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇండ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్‌ కుమార్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గాలి దుర్గారావు,జెడ్పిటిసి మోదుగుసుధీర్‌ బాబు,కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కర్నాటి రామకోటేశ్వరావు,పాసంగుల కోటేశ్వరావు,చేబ్రోలు వెంకటేశ్వర్లు,ఎస్సి సెల్‌ అధ్యక్షులు మారుపల్లి ప్రేమ్‌ కుమార్‌,చేబ్రోలు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు