Monday, April 29, 2024

టికెట్ల లొల్లితో కాంగ్రెస్‌లో కల్లోలం

తప్పక చదవండి
  • హాట్‌ హాట్‌గా మారిన టిక్కెట్ల పంచాయితీ..!
  • 2023 ఎన్నికల్లో బీసీ నినాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్‌
  • బీసీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీసీ అభ్యర్థులకే టికెట్లు
  • మాజీ పీసీసీ చీఫ్‌ది ఎవ్వరికి చెప్పుకోలేని వింత బాధ..
  • కావాలని మొండిపట్టు పడుతున్న పలువురు సీనియర్లు
  • తనకు మినహాయింపు ఇవ్వాలన్న ఉత్తమ్‌..
  • కొత్తగా చేరేవారికి టికెట్లు ఇస్తే పాతోళ్లు ఎటుపోవాలె
  • హాట్‌ హాట్‌గా మారిన టిక్కెట్ల పంచాయితీ..!
  • బీఆర్‌ఎస్‌ 119 స్థానాల్లో డోర్‌ క్లోజ్‌ చేయడంతో ..
    కాంగ్రెస్‌పార్టీ టిక్కెట్లకు ఎక్కడాలేని డిమాండ్‌..
  • 2023 ఎన్నికల్లో బీసీ నినాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్‌..
  • బీసీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీసీ అభ్యర్థులకే టికిట్లు..
  • నూతన పాలసీ అమలుచేయాలంటే
    అగ్రనేతలకు మొండిచెయ్యి తప్పదా..?
  • కావాలని మొండిపట్టుపడుతున్న పలువురు సీనియర్‌ నాయకులు
  • మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ది ఎవ్వరికి చెప్పుకోలేని వింత బాధ..
  • మాజీ పీసీసీ కాబట్టి తనకు మినహాయింపు ఇవ్వాలన్న ఉత్తమ్‌..
  • కొత్తగా పార్టీలో చేరేవారికి టికెట్లు ఇస్తే పాతోళ్లు ఎటుపోవాలె ..
    కాంగ్రెస్‌ ఇలాకాలో వారసుల లొల్లి అధినాయకత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది . విడవమంటే పాముకు కోపం.. పట్టుకుంటే కప్పకు కోపం అన్నచందంగా కాంగ్రెస్‌ లోని పలువురు సీనియర్‌ నాయకుల వ్యవహారశైలి అధినాయకత్వానికి చిరాకు తెప్పిస్తున్నాయట .. ఎవరు అవునన్నా.. కాదన్నా .. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్‌ దే కీలకపాత్ర అని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారం చేపట్టకపోవడం ఒక ఎత్తయితే.. గెలిచినోళ్లు తెరాసలోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్‌ ను.. కాంగ్రెస్‌ పెద్దలను విమర్శించడం ఢల్లీి పెద్దలను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందట .. దీంతో రేవంత్‌ రెడ్డికి పీసీసీ భాద్యతలు అప్పగించిన ఢల్లీి పెద్దలకు పలువురు సీనియర్ల ప్రవర్తన ఇబ్బందిగా మారిందట. పీసీసీ భాద్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి ఏడ్డం అంటే.. పలువురు సీనియర్లు తెడ్డం అనే పరిస్థితి దాపురించింది. పార్టీ అంతర్గత విషయాలు బయటికి చెపుతున్న కొందరి నేతల ప్రవర్తన పార్టీ ప్రతిష్టతను మసకబారుస్తుందని అధినాయకత్వం నెత్తీనోరుకట్టుకుని చెబుతున్నకొంత మంది సీనియర్లు చెవికెక్కించుకోపోగా రేవంత్‌ రెడ్డి పైనే వ్యంగస్రాలు సంధించడం పార్టీ ప్రతిష్టను బజారుకీడ్చింది. నిజానికి అధికార పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే స్థితిలో కాంగ్రెస్‌ లేదు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ లు నగరాల్లో పట్టుసాధించినప్పటికీ పల్లెల్లో వీక్‌ అనే చెప్పాలి. పల్లెల్లో ప్రజలు కాంగ్రెస్‌ కు పట్టం కట్టాలని చూస్తున్నప్పటికీ.. కాంగ్రెస్‌ నాయకుల తీరు, వారి ప్రవర్తన వారి విజయావకాశాలనే దెబ్బతీస్తున్నాయి. పూటకో మాటను మాట్లాడి తమను తాము దిగజార్చుకుంటూ .. పార్టీని ప్రజల్లో పలుచన చేసేస్తున్నారు. ఇదేంటని అడిగే నాధుడు లేడు.. అడుగుతున్న నాయకుడిపై ముప్పేట దాడికి దిగుతున్నారు..సాధారణంగా చాలామంది ఇంట్లో జరుగుతున్న విషయాలను బయటకు చెప్పాలంటే ఇష్టపడరు. అది సంస్కారం కూడా కాదు. కనీస విజ్ఞత మరిచిన కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు అధికార పార్టీకి వంతపాడుతూ వారి అడుగులకుమడుగులొత్తుతూ కొన్నెండ్లుగా తమకు, తమ కుటుంబాలకు రాజకీయ బిక్ష పెట్టిన పార్టీని అదహాపాతాళానికి తోక్కేయాలని కంకణం కట్టుకుని ప్రయత్నించడం ఎంతవరకు సరైనదో విజ్ఞులయిన నాయకులకే వదిలేస్తున్నాం. – ‘‘వాసు’’ పొలిటికల్‌ కారెస్పాడెంట్‌’’..
    హైదరాబాద్‌ : ఈ సారి జరుగబోయే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం నూతన పాలసీ విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే అభ్యర్థులకు రిజిస్ట్రేషన్‌ సిస్టం పాలసి పెట్టి.. దానిని అమలు చేస్తున్న కాంగ్రెస్‌ పెద్దలు వన్‌ ఫ్యామిలీ.. వన్‌ టిక్కెట్‌ నినాదంతో ముందుకుసాగుతూ సీనియర్‌ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. .ఇక బీఆర్‌ఎస్‌ విషయానికొస్తే టిక్కెట్లను పాతోళ్లకే కేటాయించడంతో ఆశావాహులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిరది. దీంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌ కు టచ్‌ లోకి వెళ్లినట్లు సమాచారం .అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్‌ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది .
    కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్లకు ఎక్కడాలేని డిమాండ్‌ :
    బీఆర్‌ఎస్‌ తెలంగాణాలోని 119 స్థానాల్లో ఆశావాహులకు డోర్‌ క్లోజ్‌ చేయడంతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్లకు ఎక్కడాలేని డిమాండ్‌ ఏర్పడిరది. కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు పెద్దపీట వేయాలనే అజెండాను పెట్టుకుని వాటిని అమలు చేయాలనీ చూడటంతో పాటు కుటుంబంలో ఒకరికే టిక్కెట్‌ ఇస్తామంటూ కండీషన్‌ కూడా పెడుతోంది. ఇది పలువురు సీనియర్లకు, దిగ్గజాలకు మింగుడుపడని అంశంగా మారినప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో త్యాగాలు చేయాలని సుతిమెత్తగా ఆదేశాలను కూడా జారీ చేసింది. నిజానికి అన్నిపార్టీల్లోనూ వారసుల హవా షరా మామూలే అయినప్పటికీ .. కాంగ్రెస్‌ విషయానికొస్తే.. వారసులకు స్వాతంత్రం ఇక్కడ కాస్త ఎక్కువనే చెప్పాలి. అయితే పార్టీ కండీషన్లకు పలువురు సీనియర్‌ నేతలు నిర్మొహ మాటంగా నో చెప్పేస్తున్నారట.. తమకు తమ వారసులకు ఒకే ఒక్క చాన్స్‌ ఇవ్వాలంటూ తెగ పైరవీలు చేస్తున్నారట.. ఇప్పటికే పలువురు నాయకులు ఢల్లీి కెళ్ళి ప్రయత్నాలు చేయగా… మరికొంత మంది నాయకులు ఒక టీమ్‌ గా ఏర్పడి పార్టీకి అల్టిమేటం ఇచ్చేస్తున్నారట.. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ బీసీలకు తీరని అన్యాయం చేసిందని ప్రచారం చేస్తున్న కాంగెస్‌ బీసీ నినాదాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. అధికారపార్టీ దూరం పెట్టిన బీసీలను అక్కున చేర్చుకోవాలని భావిస్తూ… బీసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ శాతం బీసీ అభ్యర్థులకే టికిట్లు కేటాయించాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో బీసీలను నిలపాలన్నది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. బీసీ ఓట్లకు గాలం వేయడానికి కాంగ్రెస్‌ అమలు చేస్తున్న ఈ నూతన పాలసి విధానంతో అగ్రనేతల అసలుకే ఎసరు వస్తోందని ప్రచారం జరుగు తోంది. ఉదయపూర్‌ డిక్లరేషన్‌ అంటూ హైకమాండ్‌పై భారం వేస్తూ తెలంగాణ పీసీసీ చాపకింద నీరులా వ్యవహారాలను చక్కబెడుతుంది.
    హాట్‌గా మారిన టిక్కెట్ల పంచాయితీ !
    కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, సీతక్క కుటుంబాల నుంచి ఒకటి కంటే ఎక్కువ టిక్కెట్లు ఆశిస్తున్నారు. అందరూ సీనియర్లు కావడం పైగా ఢల్లీి పెద్దలతో పరిచయాలున్నవారే కావడంతో ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాని టీపీసీసీ తెలివిగా ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ పేరిట హైకమాండ్‌ కోర్టులో బంతిని విసిరేసింది. ఇక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఇద్దరు కుమారులు నాగార్జునసాగర్‌ టిక్కెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డి, చిన్న కుమారుడు జైవీర్‌ రెడ్డి ఇద్దరూ అసెంబ్లీ టిక్కెట్‌నే ఆశిస్తున్నవారిలో ఉన్నారు. నాగార్జున సాగర్‌ కుదరదంటే మిర్యాలగూడ అయినా సర్దుబాటు చేయాలని మరో దరఖాస్తు సమర్పించారు రఘువీర్‌ రెడ్డి. ఒక టిక్కెట్‌ ఇస్తామంటే రెండు సీట్లకు ఇద్దరు పోటీపడటంతో కాంగ్రెస్‌లో విస్తృత చర్చకు దారి తీసింది. ఇదే విధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి
    దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ రెండేసి టిక్కెట్లు ఆశిస్తున్నారు. ఐతే వీరిద్దరూ కాస్త తెలివిగా ఒక అసెంబ్లీ, మరో పార్లమెంట్‌ టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఒకే టిక్కెట్‌ నిబంధనకు కట్టుబడుతున్నట్లు చెబుతూనే తమతోపాటు వారసులతోనూ దరఖాస్తు చేయించారు. రాజనర్సింహ కుమార్తె త్రిశాల అంధోల్‌ టిక్కెట్‌ను, అంజన్‌కుమార్‌ కుమారుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ ముషీరాబాద్‌ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు.
    వారసులకు అసెంబ్లీ టిక్కెట్‌ .. తమకు ఎంపీ టిక్కెట్‌ :
    వారసులకు అసెంబ్లీ టిక్కెట్‌ ఇస్తే తమకు ఎంపీ టిక్కెట్‌ ఇవ్వాలని మెలిక పెడుతున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ లు.ఇక ములుగు ఎమ్మెల్యే సీతక్క కొడుకు సూర్యం పినపాక టిక్కెట్‌ ను ఆశిస్తుంటే .. మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌ కుమారుడు సాయిరాంనాయక్‌ ఇల్లందు టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎవరో ఒకరికే టిక్కెట్‌ అంటూ టీపీసీసీ ఇప్పటికే తెల్చిపారేసింది. ఇదంతా ఒక ఎత్తయితే మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిది ఎవ్వరికి చెప్పుకోలేని వింత బాధ. గతంలో ఉత్తమకుమార్‌ హుజూర్‌ నగర్‌ ఎమ్మెల్యేగా.. కోదాడ నుంచి ఆయన సతీమణి పద్మావతి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వీరిద్దరూ ఆ సీట్లను మళ్లీ అడుగుతు న్నారు. ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ మీటింగ్లో మాజీ పీసీసీ చీఫ్‌ అయినందున తన కుటుంబానికి మినహాయింపు ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరినట్లు సమాచారం. ఈ విషయంపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మధ్య స్వల్ప వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది.టిక్కెట్ల విషయంలో తనను డిక్టేట్‌ చేయొద్దని రేవంత్‌ చెప్పేయగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ తనకు, తన భార్యకు అవకాశం ఇవ్వాల్సిందేనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టుబడు తున్నట్లు సమాచారం. ఇదే అదునుగా రేవంత్‌ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి పలు ఆరోపణలు సంధించారు .. రేవంత్‌ రెడ్డి బీసీ నినాదం తెరపైకి తెచ్చి ఉత్తమ్‌కు చెక్‌ పెట్టారని అంతా అనుకుంటున్నారని ఘాట యిన వ్యాఖ్యలు చేశారు. .. ఇంటితో ఆగకుండా నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున .. కోదాడ, నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్‌ టిక్కెట్లను బీసీలకు కేటాయించాలని ఉచితా సలహా కూడా ఇచ్చిపారేశారు . ఇలా ముఖ్యనేతలే పార్టీ నియమ, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేవిధంగా టిక్కెట్లకు పోటీపడుతుండటం కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది. ఇవన్నీ ఏమోగానీ మాజీ పీసీసీ చీఫ్‌, ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విషయంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం ఎలా స్పందిస్తుదనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
    కొత్తగా పార్టీలో చేరేవారికి టికెట్లు ఇస్తే పాతోళ్లు ఎటుపోవాలె :
    వరంగల్‌ తూర్పు నుండి కొండా సురేఖ పోటీ చేస్తే.. పరకాల నుండి కొండా మురళి బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల లిస్టులో తన పేరు లేకపోవడంతో.. ఆ పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌.. కాంగ్రెస్‌ కండువకప్పుకున్నారు. ఆమె తన భర్తకు కూడా టికెట్‌ కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఇక తన కొడుకు కోసం నమ్ముకున్న పార్టీకే ఎదురు తిరిగిన మైనంపల్లి హనుమంత రావుకు కాంగ్రెస్‌ లో కూడా ఎదురుదెబ్బ తగేలేలా ఉంది. నిజానికి మైనంపల్లికి అధికార పార్టీలో పెద్దగా సమస్యలేమీ లేవు.. తన కొడుక్కి (మైనంపల్లి రోహిత్‌) కు అవకాశం ఇవ్వలేదన్న కోపం తప్ప ఆయనకు బీఆర్‌ఎస్‌ నాయకులతో పెద్దగా సమస్యలు లేవు. ఆయన బీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి దిగుతారా లేక కొడుకునే మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీకి నిలబెడతారా అన్నది తేలాల్సివుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ప్రతీ నియోజకవర్గానికీ.. భారీగా ఆశావహులు ఉన్నారు. ఇలాంటి సమయంలో.. కొత్తగా పార్టీలో చేరేవారికి టికెట్లు ఇస్తే.. ఆల్రెడీ ఉన్నవారు రెబెల్‌ అయ్యే ప్రమాదం ఉంటుందని పలువురు సీనియర్లు హెచ్చరిస్తున్నారు. . ఇది కాంగ్రెస్‌కి పెద్ద సమస్య కాగలదు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు