Tuesday, May 14, 2024

ధరణి పేరుతో బీఅర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దందా

తప్పక చదవండి
  • కేసిఆర్‌ రైతు వ్యతిరేకి, మోడీ రైతు పక్షపాతి
  • ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా జీతాలు చెల్లించాలంటే
    రాష్ట్రంలో ఉన్న భూములు అమ్మాల్సిన పరిస్థితి
  • ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్యకర్తలు
    సిద్దంగా ఉండాలి
  • బీజేపీ కిసాన్‌ మోర్చా రైతు సమ్మేళనంలో పాల్గొన్న
    బీజేపీ చీఫ్‌ గంగాపురం కిషన్‌ రెడ్డి

    ఇబ్రహీంపట్నం :ధరణి పేరుతో బీఅర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు దందా చేస్తూ అవినీతి సొమ్ము సంపాదిస్తున్నారనీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి , తెలంగాణ బీజేపీ చీఫ్‌ గంగాపురం కిషన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఆదిభట్ల మున్సిపాలిటీ లోని ఓ ఫంక్షన్‌ హాల్‌ లో బీజేపీ కిసాన్‌ మోర్చ రైతు సమ్మేళనంలో కేంద్ర పర్యాటక మంత్రి , రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు గంగాపురం కిషన్‌ రెడ్డి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు…. రైతు చట్టాలు అమలు కాకుండా కాంగ్రెస్‌ అడ్డుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే ముడి సరుకుకు సబ్సిడి ద్వారా సంవత్సరానికి రూ. 18 వేల అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రభుత్వము రైతులను మభ్యపెట్టి,కాలం గడుపుతున్నారన్నారు. రైతు రాజ్యం కోసం బీజేపీ ఉంటుందన్నారు. గతంలో ఏరువులకోసం పడిగాపులు కాసిన సందర్బాలు ఉన్నాయనీ , కానీ మోడి హయాంలో 365 రోజులు రైతులకు ఆన్ని విదాలుగా అదుకుంటున్నారని అన్నారు. రూ. 600 కోట్లా తో రామ గుండంలో యూరియా పరిశ్రమను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కెసీఆర్‌ ప్రభుత్వము దేశంలోనే అవినీతి రాష్ట్ర ప్రభుత్వముగా ఉందనీ విమర్శించారు. విద్యుత్‌ సంస్థలను నిర్వీర్యం చెసిన ఘనత కెసీఆర్‌ కి దక్కుతుందని అన్నారు. ప్రపంచంలోకెల్లా అభివృధి చెందినా దేశంగా భారత్‌ ను మోడి చేశారనీ అన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేయాలనీ తెలిపారు. మహిళ రిజ్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కు లేదు కేసీఆర్‌ కు లేదన్నారు. రాష్ట్రం ఏర్పాటు మొదటి ప్రభుత్వంలో కెసీఆర్‌ మంత్రి మండలిలో ఒక్క మహిళ మంత్రి లేకపోవడం సిగ్గు చేటని అన్నారు. బీఆర్‌ఎస్‌ , కాంగ్రెస్‌ ఓట్లేస్తే మజ్లీస్‌ పార్టీ కి ఓట్లు వేసినట్టేనని అన్నాడు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభూజీ, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి, భువనగిరి పార్లమెంటు మాజీ సభ్యుడు బూర నరసయ్య గౌడ్‌ , కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్‌ , తల్లోజు ఆచారి , ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష , బోసుపల్లి ప్రతాప్‌ , పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు