Monday, May 6, 2024

ఉద్యోగుల ఉసురు తీస్తున్న టీజీఓ అధ్యక్షురాలు..

తప్పక చదవండి
  • రిటైర్డ్ అయిన భర్తకు ఎక్స్ టెన్షన్ ఇప్పించుకున్న వైనం..
  • కేసీఆర్ కు బానిసలా మారి ఉద్యోగుల పొట్టకొట్టిన దుర్మార్గం..
  • ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని శ్రీనివాస్ గౌడ్
    తన బినామీగా మమత నియామకం..
  • రెండు పీ ఆర్ సి లు కోల్పోయిన ఉద్యోగులు..
  • కేసీఆర్ భజనలో మునిగితేలిన దౌర్భాగ్యం..
  • కంచె చేను మేసిన చందంగా స్వార్ధపూరిత రాజకీయం..
  • పేరుకే మమత ఆమె చరిత్రలో మమత లేదు.. మానవత్వం లేదు..

కొత్త ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలంటున్న ఉద్యోగులు.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న టి ఎన్ జీ ఓ, టి జీ ఓ సంఘాలు ఆ తరువాత సంఘ పెద్దల స్వార్ధపూరిత రాజకీయాలతో తమ జీవితాలను కోల్పోవాల్సి వచ్చింది.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి టి జీ ఓ నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిరంకుశంగా వ్యవహరించడం దారుణం.. కొత్త ప్రభుత్వంలో నైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు..

హైదరాబాద్ : ఉద్యోగ ఉపాధ్యాయ టి ఎన్ జీ ఓ / టి జీ ఓ సంఘాలు తెలంగాణ ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నారు.. వారితో పాటు ఇతర ఉద్యోగులు జె ఏ సి గా ఏర్పాటు అయ్యి ఉద్యమంలో పాల్గొన్నారు.. కాగా తెలంగాణా ఏర్పాటు తర్వాత ఉద్యోగుల ఆకాంక్షలకు అనుకూలంగా కాకుండా స్వంత ప్రయోజనం కోసం వెంపర్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళ దగ్గర కుక్కల్లా ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు పెట్టి.. ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు పొంది.. ఉద్యోగులను దారుణంగా మోసం చేశారు సో కాల్డ్ లీడర్స్.. ఈ వ్యవహారంలో ముందు వరుసలో టి ఎన్ జీ ఓ నాయకులు స్వామి గౌడ్, దేవిప్రసాద్, కారం రవీందర్ రెడ్డి, రాజేందర్, టీజీవో నాయకుడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.. వీరి స్వార్ధానికి ఉద్యోగులు రెండు పీ ఆర్ సి లు కోల్పోయారు.. ఉద్యోగుల సమస్యలు గాలికి వదిలేసి.. వారంతా కెసిఆర్ భజన లో మునిగి తేలారు.. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీవో అధ్యక్షులుగా వున్నప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.. జీ ఓ ఎం ఎస్ నెంబర్ 400 ఎం ఏ అండ్ యూడీ ( ఏ 1 ) డిపార్ట్మెంట్, 3-5-2014 జీవో ద్వారా ఇతని రాజీనామాకు అప్పటి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.. కాగా తిరిగి శ్రీనివాస్ గౌడ్ తనను టీజీవో సంఘానికి చైర్మన్ గా ఎన్నుకున్నారు అని రిఫరెన్స్ నెంబర్ టి జీ ఓ/2703/214/తేదీ 27-3-2014 అనే లెటర్ ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో సమర్పించారు.. కాగా దీనిపై జీ ఏ డీ అధికారులు టీజీవో కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు ను వివరణ కోరగా లెటర్ నెంబర్ టి జీ ఓ /1004/214, తేదీ 10-4-2014ద్వారా టీజీవో బై లాస్ లో చైర్మన్ పదవి లేదు అని.. టీజీవో సంఘం ఎలాంటి సమావేశం ఏర్పాటు చెయ్యలేదు అని.. శ్రీనివాస్ గౌడ్ ను చైర్మన్ గా ఎన్నుకోలేదని జీ ఏ డీ అధికారుల కు వివరణ ఇవ్వగా.. దీనిపై సమగ్ర విచారణ చేసిన జీ ఏ డీ అధికారులు జీ ఓ ఆర్ టి నెంబర్ 1744 జీ ఏ డీ (ఎస్ డబ్ల్యు 1) డిపార్ట్మెంట్ 3-5-2014ద్వారా శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసినాడు కావున అతడు ఉద్యోగ సంఘంలో కొనసాగే అవకాశం లేదు.. అతను ఏ విధంగా సంఘానికి సంబందించించి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అని స్పష్టంగా పేర్కొన్నారు.. అయినప్పటికి శ్రీనివాస్ గౌడ్ తన ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని.. ఇతర టీజీవో సభ్యులను బెదిరించి తన బినామీ అయిన మమతను ఎలాంటి ఎన్నికలు నిర్వహించకుండా ప్రకటించుకుని.. తన ఇష్టరాజ్యంగా కార్యక్రమాలు నడిపించాడు.. మమత టీజీవో అధ్యక్ష పదవి ని అడ్డం పెట్టుకొని ఆమె భర్త రిటైర్ అయినా కూడా తిరిగి ఎక్సటెన్షన్ తెచ్చుకున్నారు.. పైరవీలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించింది.. అని టీజీవో సభ్యుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఒక నియంత కెసిఆర్ పాలన అంతం అయినది.. ప్రజా పాలన మొదలైంది.. ఇప్పటికైనా టీజీవో సంఘంలో సభ్యత్వం చేయించి.. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపించి.. ఉద్యోగుల సమస్యలపై పోరాడే నాయకులను ఎన్ను కోవాలి అని గెజిటెడ్ అధికారులు కోరుకుంటున్నారు.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఆస్తులు సంపాదించిన టి జీ ఓ / టి ఎన్ జీ ఓ నాయకుల అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు.. కనీసం ఈ ప్రభుత్వంలో అయినా ఉద్యోగులకు ప్రయోజనం జరుగుతుంది అని వారు ఆశిస్తున్నారు.. తెలంగాణా ఉద్యమంలో చురుకుగా పాల్గొని.. తెలంగాణా వచ్చిన తర్వాత అన్యాయానికి గురి అయిన ఒక సగటు గెజిటెడ్ అధికారి కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు