Monday, May 6, 2024

చివరి రోజు ఉద్రిక్తం

తప్పక చదవండి
  • మంత్రి వస్తున్నాడని ఇతర యూనియన్లను అడ్డుకున్న పోలీసులు
  • ఎమ్మెల్యే, సీఐటియు నాయకుడు అడ్డగింత
  • హెడ్డాఫీస్‌ ముందు యూనియన్ల ఆందోళన
  • సింగరేణిలో ముగిసిన ప్రచారం

కొత్తగూడెం సింగరేణి : ఈనెల 27న జరగనున్న ఎన్నికల ప్రచారప్రక్రియ సోమవారంతో ముగిసింది. చివరి రోజు సింగరేణి వ్యాప్తంగా బరిలో ఉన్న ఆయా యూనియన్లు సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు, వివిధ సంఘాల ప్రతినిధులతో సంస్థ వ్యాపించి ఉన్న 11ఏరియాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించాయి. గనులు, ఓపెన్‌కాస్టులు, డిపార్టుమెంట్‌లు చివరి రోజు ప్రచారాలతో హోరెత్తాయి.అన్ని ఏరియాల్లో ప్రచార కార్యక్రమాలు ప్రశాంతంగా ముగియగా కార్పోరేట్‌ ఏరియాలోని హెడ్డాఫీస్‌లో మాత్రం ఉద్రిక్తపరిస్థితికి దారి తీసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రచారాన్ని నిర్వహిస్తూహెడ్డాఫీసుకు రానున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.ప్రదాన గేటు వద్ద ఎమ్మెల్యే సాంబశివరావుతోపాటు సిఐటియుసి రాష్ట్రప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు, ఇతర నాయకులను హెడ్డాఫీస్‌లో ప్రచారంనిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే కూనంనేని, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఒక సందర్భంలో తోపులాట సైతం చోటు చేసుకుంది.పోలీసులు, యాజమాన్యం తీరును నిరసిస్తూ ఎమ్మెల్యేతోపాటు కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు సింగరేణి ప్రధాన కార్యాలయం గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే, సిఐటియురాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, ఎఐటిసి కార్పోరేట్‌ బ్రాంచ్‌ సెక్రటరీ వంగా వెంకట్‌లు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందని ఆహక్కును కాంగ్రెస్‌ప్రభుత్వంతోపాటు యాజమాన్యం కాలరాస్తోందన్నారు.ప్రచారం నిర్వహించకుండా నిబంధనలు తుంగలో తొక్కుతూ ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ ఉండగా హెడ్డాఫీస్‌ లోపల ప్రచారం చేసుకునేందుకు మంత్రి పొంగులేటికి అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.అధికార బలంతో ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని అందుకు నిదర్శనమే ఈ సంఘటన అన్నారు. 27న జరిగే ఎన్నికల్లో కార్మిక సంఘాలను కాంగ్రెస్‌ ప్రభుత్వంతోపాటు మంత్రి పొంగులేటి బెదిరించి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఎన్నికల అధికారులతోపాటు పోలీసులు, సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు