Monday, May 13, 2024

పురాతన దేవాలయం.. దుర్గందానికి నిలయం

తప్పక చదవండి

వెల్గటూర్‌ : వెల్గటూర్‌ మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటిలింగాల ఆలయం కోటి ఇసుక రేణువుల సమూహం. త్రేతా యుగంలో మునీశ్వరులచే ప్రతిష్టిం చబడిన సైకత లింగం శాతవాహనులు నిర్మించిన పవిత్ర పరమేశ్వరాలయం శాతవాహనుల రాజధానిగా ఖ్యాతిగాంచిన కోటిలింగాల ఇప్పుడు పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఈ ప్రాంత చరిత్రకు ఎన్నో ఆధారాలు ఈ నేల గర్భం లోనే దాగి ఉన్నాయి. శతాబ్దాలు దాటిన చెక్కుచెదరని వైనం ఇది కోటిలింగాల దేవాలయం యొక్క ఘనమైన చరిత్ర. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మురుగునీరు పోయే సౌకర్యం కూడా లేదు.గుడి ముందే మురుగునీరు నిల్వ ఉండటం వల్ల దుర్గంధపు వాసనతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు గత ప్రభుత్వం పర్యాటక పరంగా కొంత అభివృద్ధి చేసినా కానీ కనీస సొకర్యం అయిన మురుగునీరు గురించి పట్టించుకోక పోవడం శోచనీయం.నిత్యం వందలాది మంది భక్తులు దర్శించుకునే కోటిలింగాల పుణ్య క్షేత్రం గుడి మెట్లు ఎక్కేటప్పుడు పక్కనే మురుగు నీరు నిల్వ ఉండటం,మురుగు నీరు నుండి వచ్చే దుర్వాసనతో భక్తులు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.అప్పుడప్పుడు కొంత మురుగు నీరు తొలగిస్తున్న మళ్ళీ మురుగు నీరు వచ్చి చేరుతుంది మురుగు నీరు నిల్వ కోసం మట్టి తో కట్ట పోయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం అయినా ఆలయం గురించి పట్టించుకొని మురుగునీరు శాశ్వతంగా తొలగించి ఆలయ పరిశుభ్రతను, తద్వారా భక్తుల ఆరోగ్యాన్ని కాపాడాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు