Wednesday, May 15, 2024

అభ్యర్థుల ప్రకటనలో ఎటూ తేల్చుకోలేక పోతున్న హస్తం పార్టీ

తప్పక చదవండి

ఇండోర్‌ : ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రెస్‌ బాగా వెనకబడుతుంది. చివరి రోజు వరకు సస్పెన్స్‌ కొనసాగుతోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనలో ఇప్పుడు హస్తం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించినా కాంగ్రెస్‌ పార్టీ వేగం పుంజుకోలేదు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే తొలి లిస్టు విడుదల చేయాల్సివుంది. కానీ
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్టు సమాచారం. టికెట్‌ రానివాళ్లు పార్టీ మారే అవకాశాలుంటాయని, ఇలాంటి వాళ్లను బుజ్జగించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ ఒకే దఫాలో అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ మాత్రం ఇంకా తన గెలుపు గుర్రాలను అధికారికంగా ప్రకటించలేకపోతోంది. మిత్రపక్షాలతో సీట్ల సర్ధుబాటు, ఇంకా అనేక ఈక్వేషన్స్‌ టీ కాంగ్రెస్‌ పార్టీ ముందున్నాయి. అవన్నీ తేలితే గానీ అభ్యర్థుల ప్రకటన ఉండదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు