Saturday, May 4, 2024

స్మోక్‌ బాంబ్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం

తప్పక చదవండి
  • వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు

న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో డిసెంబర్‌ 13న పలువురు వ్యక్తులు లోక్‌సభ గ్యాలరీలో అక్రమంగా ప్రవేశించి స్మోక్‌ గన్స్‌ విసిరిన ఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. దీనివెనక కుట్రదారులను ఛేదించే క్రమంలో దర్యప్తు ముమ్మరం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.ఢిల్లీప్రత్యేక విభాగ బృందాలు రాజస్థాన్‌, హరియాణా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్రల్లో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు.నిందితుల్లో ఒకరైన సాగర్‌ శర్మను దక్షిణ రేంజ్‌లోని స్పెషల్‌ సెల్‌ బృందం విచారిస్తోంది. పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన లలిత్‌ సౌత్‌ వెస్టన్ర్‌ రేంజ్‌లోని జనక్‌పురి స్పెషల్‌ సెల్‌ టీమ్‌కు అప్పగించారు. ఇటీవల, ఈ బృందం రాజస్థాన్‌లోని నాగౌర్లో ధ్వంసమైన మొబైల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకుంది. పోలీసులు 50 బృందాలుగా విడిపోయి వారి డిజిటల్‌, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత నేపథ్యం తదితర విషయాలను ఆరా తీస్తోంది. నిందితులను వెంట తీసుకెళ్లి దర్యాప్తు కొనసాగి స్తోంది. మరో నిందితురాలైన నీలం దేవిని ఢల్లీిలోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీలోని స్పెషల్‌ సెల్‌ టీమ్‌ దర్యాప్తు చేస్తోంది. దీనిని స్పెషల్‌ సెల్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అని కూడా పిలుస్తారు. నిందితులందరినీ శనివారం స్పెషల్‌ సెల్‌లోని వివిధ విభాగాలకు అప్పగించారు. ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం.. వారిని తదుపరి విచారణ కోసం ఔఈఅ స్పెషల్‌ సెల్‌ బృందానికి అప్పగిస్తారు. దాడివెనక ఎవరున్నారన్న దానిపై నిగ్గు తేలాల్సి ఉందని ప్రధాని మోడీ కూడా ప్రకటన చేశారు. స్పీకర్‌ ఓం బిర్లా కూడా దర్యాప్తునకు ఆదేశించడంతో బృందాలు రంగంలోకి దిగాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు