Friday, May 10, 2024

కాంగ్రెస్‌ను నమ్మితే ఆగమవ్వుడు ఖాయం

తప్పక చదవండి
  • బీఆర్‌ఎస్‌ పాలనలోనే హుస్నాబాద్‌ అభివృద్ధి
  • కేసీఆర్‌ వచ్చాక ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు
  • హుస్నాబాద్‌ రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు

హుస్నాబాద్‌ : ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అధికార ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. 10 ఏళ్ల అభివృద్ధినే అస్త్రంగా చేసుకుని బీఆర్‌ఎస్‌ ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌ రావు ఇవాళ హుస్నాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో హుస్నాబాద్‌ అభివృద్ధి చెందలేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హుస్నాబాద్‌లో రోడ్‌ షోలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌ పాలనలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని తెలిపారు. కోహెడ మండలంలోని అన్ని గ్రామాలకు భవనాలు మంజూరు చేశామని వెల్లడిరచారు. కేసీఆర్‌ వచ్చాక ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు వచ్చాయన్న మంత్రి.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. కరోనా వచ్చినప్పుడు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలను నమ్మితే మోసపోవడం ఖాయమని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. హస్తం నాయకులు ప్రకటించిన మేనిఫెస్టో కంటే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చాలా నయమని చెప్పారు. తమ ప్రభుత్వం 24 గంటల కరెంట్‌ ఇస్తుంటే.. రేవంత్‌ రెడ్డి మాత్రం కేవలం 3 గంటలు సరిపోతుందంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో చెక్‌డ్యామ్‌లు కట్టుకున్నాం. రైతుబంధు పెట్టి దుబారా ఖర్చు చేస్తున్నారని ఉత్తమ్‌ అంటున్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధు జీరో అవుతుంది. బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే రైతుబంధు డబ్బులు వస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో కోటి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ఇవ్వబోతున్నాం. బీఆర్‌ఎస్‌ గెలిచిన వెంటనే జనవరి నుంచి సన్న బియ్యం ఇస్తామని అన్నారు. కేసీఆర్‌ అంటే రాష్ట్ర ప్రజలకు నమ్మకమని.. మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దే అని.. గీత, నేత కార్మికులకు పింఛన్‌ ఇస్తున్నామని చెప్పారు. అధికారం కోసం కాంగ్రెస్‌ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. హుస్నాబాద్‌లో మూడు దిక్కులా అభివృద్ధి అవుతుందని.. కోహెడ ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేయించామని .. హుస్నాబాద్‌లో 100 పడకల గది నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ వాళ్లు కరెంటు మీటరు పెట్టి ఇంటికి బిల్లు ఇవ్వమంటున్నారని.. కాంగ్రెస్‌ నాయకులు మూడు గంటల కరెంటు చాలు అంటున్నారని మండిపడ్డారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు