Sunday, April 28, 2024

బైడెన్‌ కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు..

తప్పక చదవండి
  • డెలావర్ లో చోటు చేసుకున్న ఘటన
  • కాన్వాయ్ లోని వాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ వాహనం
  • బైడెన్, ఆయన భార్యను సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది

అమెరికాలో కలకలం చెలరేగింది. అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ లోకి ఒక కారు దూసుకొచ్చింది. కాన్వాయ్ లోని ఒక సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొంది. ధ్యక్షుడు బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ ఆదివారం రాత్రి 8.09 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఉన్న తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్‌ ముగించుకుని ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్‌ వద్దకు వస్తున్నారు. ఇంతలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్‌లోని యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ వాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా మరో వాహనంపైకి దూసుకెళ్లింది.

ఈ ఘటన జరిగినప్పుడు జిల్‌ బైడెన్‌ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండటా.. ప్రెసిడెంట్‌ బైడెన్‌ 130 అడుగుల దూరంలో ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైట్‌హౌస్‌కు తరలించారు. దంపతులిద్దరు క్షేమంగా ఉన్నారని అధ్యక్ష భవన వర్గాలు వెల్లడించారు. కాగా, ఘటనకు పాల్పడిన డ్రైవర్‌ను సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు