Friday, May 17, 2024

కాంగ్రెస్‌ రైతు వ్యతరేక విధానం బట్టబయలు

తప్పక చదవండి
  • రైతుల నోటికాడ బుక్కను ఎత్తగొట్టారు
  • ఇది ఎన్నికల పథకం కాదని తెలియదా అంటూ ఆగ్రహం
  • రైతువ్యతిరేక కాంగ్రెస్‌కు ఓటేయొద్దని పిలుపు
  • రైతుబంధు నిలిపివేతపై కవిత ఆగ్రహం

నిజామాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ తన రైతు వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైతుల నోటికాడ బుక్కను గుంజుకుందని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు వెంబటబడి రైతు బంధును నిలిపివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఎన్నికల కోసం తెచ్చింది కాదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రైతు బంధును కాంగ్రెస్‌ వెంటపడి ఆపించిందన్నారు. కాంగ్రెస్‌కు అంత అభద్రత ఎందుకని ప్రశ్నించారు. రైతులు బీఆర్‌ఎస్‌ వైపు ఉన్నారనే భయంతోనే రైతు బంధుపై కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసి రైతు బంధును రైతు రుణమాఫీని ఆపిందన్నారు. రైతు వ్యతిరేకతను చాటుకుందన్నారు. నోటి కాడి బుక్కను లాక్కున్నారు కాబట్టి రైతులు ఆలోచించి ఓటు వేయాలని కవిత కోరారు. నిజామాబాద్‌లో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత విూడియాతో మాట్లాడారు. రైతుబంధు ఎన్నికల కోసం పెట్టిన పథకం కాదని చెప్పారు. ఇప్పటికే రూ.72 వేల కోట్లు రైతుబంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేశామన్నారు. రైతులంతా బీఆర్‌ఎస్‌ వైపు ఉన్నారన్న అభద్రతలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నదని విమర్శించారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్‌ మరోసారి రైతులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించిందన్నారు. అన్నదాతలంతా ఓటు ద్వారా ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. రైతుబంధు కావాలా.. రాబందులు కావాలా అని ప్రశ్నించారు. మతం పేరుతో ఒక పార్టీ, కులం పేరుతో మరోపార్టీ నడుస్తున్నదని విమర్శించారు. గల్ఫ్‌ కార్మికులకు ప్రత్యేక ముసాయిదా తయారు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో నిరుపేదలకు వరమని చెప్పారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలన్నారు. విభజన హావిూలపై కాంగ్రెస్‌ నాయకులు ఏనాడూ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణపై కేంద్ర విషం చిమ్ముతున్నదని చెప్పారు. రాష్టాన్రికి నిధులు ఇవ్వకుండా కేంద్రం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ వెయ్యి బుల్డోజర్లు పంపినా కారుతో సమాధానం చెబుతామన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై మిడతల దండులా తెలంగాణపై పడ్డారన్నారు. మది ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించా మని చెప్పారు. ఉపాధి హావిూ కూలీల ప్రయోజనాలపై కాంగ్రెస్‌ ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. పేదలు, మధ్యతరగతి వర్గాలపై కాంగ్రెస్‌ పార్టీకి ప్రమలేదన్నారు. సింగరేణిని ప్రైవేటుకు అప్పగించిందే హస్తంపార్టీ అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ప్రియాంకా గాంధీ చదువుతున్నారని ఎద్దేవాచేశారు. రాహుల్‌ గాంధీ జోడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన లేదన్నారు. బీజేపీని కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రెండు పార్టీల నేతలంతా ఎక్కడున్నారని నిలదీశారు. బీజేపీ హయాంలో బాగుపడ్డది కేవలం కార్పొరేట్లు మాత్రమేనని విమర్శించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. తమ శతృత్వమంతా బీజేపీతోనేనని అన్నారు. కాంగ్రెస్‌ గుండాల ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని కవిత విమర్శించారు. సింగరేణి ప్రైవేటీకరణ అని అంటున్న ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. సింగరేణిని ప్రైవేట్‌కు అప్పగించింది కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద వాళ్ళే బాగుపడ్డారన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాల్లో ఇంతవరకూ కేంద్రం నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. యువత అడగాలన్నారు. మతం పేరుతో మంట పెట్టాలి అని ఒక పార్టీ చూస్తుంటే.. కులం పేరుతో చిచ్చు పెట్టాలని మరో పార్టీ చూస్తోందని కవిత విమర్శించారు. మంచోల్లు కావాలా ముంచే వాళ్లు కావాలా ఇరిగేషన్‌ కావాలా మైగ్రేషన్‌ కావాలా 24 గంటల కరెంటు కావాలా 3 గంటల కరెంట్‌ కావాలా? అని కవిత ప్రశ్నించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు