Monday, April 29, 2024

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆలయ భూములకు రక్షణ కరువు

తప్పక చదవండి
  • మహేశ్వరం నియోజకవర్గంలో ఆలయ భూములు రక్షించే వారే లేరా
  • రాష్ట్రీయ వానర సేన సభ్యులు చూపితే కానీ అధికారులకు కనపడడం లేదా
  • మంత్రి పోద్బలంతోనే కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపణ
  • బీఆర్‌ఎస్‌, ఎంఐఎం నాయకులు కలిసి దోచుకుంటున్నారు
  • ఆలయాల భూములు కాపాడాలంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వనర సేన జాతీయ అధ్యక్షుడు నామ్‌ రామ్‌ రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ఆలయాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రికి దేవాలయాల భూములు కబ్జాలకు గురవడం కనపడడం లేదా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు నాకంటే గొప్ప హిందూ ఎవరూ లేరని నేను చేసే యాగాలు దేశంలోనే ఎవరు చేయరని ప్రగల్బాలు పలికే ముఖ్యమంత్రి ఒక్కసారి రాష్ట్రంలోని దేవాలయాల భూముల పరిస్థితి ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. కొండగట్టు, యాదాద్రి,జోగులాంబ, భద్రాచలం, వేములవాడ, ధర్మపురికి, ఏడుపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలోని ఎన్నో దేవాలయాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నానని చెప్పే ముఖ్యమంత్రి కబ్జా భూముల మాటేంటి మీకే తెలియాలి.

ఆలయ భూముల కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు

- Advertisement -

మహేశ్వర నియోజకవర్గం బాలాపూర్‌ (మండలం) గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన సర్వే నెంబర్లు 14, 68, 69, 70 లలో గల 19 ఎకరాల ఐదు గుంటల భూమి కబ్జాకు గురవడంతో దానిపై రాష్ట్రీయ వానర సేన సభ్యులు ఎండోమెంట్‌ కమిషనర్‌, బాలాపూర్‌ తహసిల్దార్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అధికారులకుఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు ఆలయ భూములకు రక్షణ కల్పించాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఊరు ఊరు తిరుగుతూ హిందువులంతా ఏకం చేస్తూ హిందూ ఆలయాల కబ్జాలు కానీ ఇతర వ్యవహారాల మీద పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని వారు తెలియజేశారు.

temple lands grabbing under BRS government

మహేశ్వరం నియోజకవర్గంలో ఆగని ఆలయ భూముల కబ్జాలు

తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా కొనసాగుతున్న సబిత ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో కబ్జాలు మాత్రం ఆగడం లేదు. వారు మాత్రం తను గొప్ప హిందుత్వ వాదినని ఆలయాల అభివృద్ధికి ఎన్నో నిధులు వెచ్చించి అభివృద్ధి చేశామని గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడ ఆలయ భూములు కనపడ్డ టిఆర్‌ఎస్‌ నాయకులు ఎంఐఎం నాయకులు మంత్రి కుటుంబ సభ్యుల అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు మాత్రం వినపడుతున్నాయి. కానీ దేవాలయాల జోలికి వస్తే వారిని ఊరికే వదిలిపెట్టేది లేదని రాష్ట్రీయ వానర సేన సభ్యులు నామ్‌ రామ్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆలయ భూములతో పాటు సామాన్యుల భూములకు కూడా రక్షణ కరువైందని, రాష్ట్రం మొత్తం కబ్జాల పర్వం కొనసాగుతుందని తాగుతుందని దీనికి ప్రభుత్వ పెద్దల అండదండలు అలాగే అవినీతి అధికారుల అండదండలు ఉండడంతో కబ్జా రాయుళ్లు పేట్రేగిపోతున్నారని వారు ధ్వజమెత్తారు. మహేశ్వరం నియోజకవర్గంలోని దేవతలగుట్ట, మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి, గట్టుపల్లి ఆంజనేయ స్వామి, మహేశ్వరం ఆలయ భూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి ఆలయ భూముల పరిరక్షణ చట్టం ఏం చెబుతుంది దానికి భిన్నంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది వీటన్నింటి పైన ప్రభుత్వం, అధికారులే సమాధానం చెప్పాలి రాష్ట్రీయ వానర సేన తెలంగాణ రాష్ట్రం

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు