- కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి
జనగామ : ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్బంగా దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా, జనగామ పట్టణంలో 30వ వార్డులో, చౌరస్తాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు జనగామ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి. ఈ సందర్భంగా దశమంత రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య భారతావని కంటే ముందే.. స్వచ్ఛభారత్ నిర్మించుకోవాలన్న మహాత్ముని మాటలే స్ఫూర్తిగా వారి జయంతిని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టే స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందాన్నిచ్చింది అని తెలిపారు. జిల్లా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బిజెపి కార్యకర్తలు వివిధ స్వచ్ఛంద సంస్థలు పార్టీలకతీతంగా స్వచ్ఛభారత్ లో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్, ప్రధాన కార్యదర్శి సౌడ రమేష్, కన్వీనర్ కొంచెం శ్రీనివాస్, కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, తోకల హరీష్, గోధుమల అశోక్, చంద్రయ్య, హరిప్రసాద్, రఫ్తార్ సింగ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు..