Sunday, May 19, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

దేశభక్తి జీవితం కంటే గొప్పదని
నమ్మారు గాంధీజీ..
బ్రిటిష్ వలసవాదుల నుంచి విముక్తి కోసం
దేశమంతా కలియతిరిగి
కూడు, గుడ్డ, గూడు లేని
బానిస బతుకులకు చలించి
అర్ధనగ్న(అంగ) వస్త్రాన్ని ధరించాడు..
సూర్యుడు అస్తమించని సామ్రాజ్యమని
బీరాలు పలికిన బ్రిటిష్ మత్త గజాలను
అహింసా ఆయుధంతో..
“క్విట్ఇండియా” నినాదంతో
పడమర దారిపట్టించి..
స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను సాధించారు..
ఏ పదవి ఆశించని
వారి నిస్వార్థ త్యాగాల ముందు
మనం ఎంత? మనమెక్కడ?
గాంధీ కలలుగన్న స్వాతంత్ర్యం
రాజకీయమైనది కాదు?
సరికొత్త సమ సమాజాన్ని సృష్టించాలన్న
అమర సందేశ స్ఫూర్తితో..
నేటి పార్టీలు ప్రజాస్వామ్య పాలనలో
గాంధీజీ ఆశయాలను.. ప్రజల ఆకాంక్షలను
నెరవేర్చడమే వారికిచ్చే నివాళులు..

  • దామోదర్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు