Sunday, April 28, 2024

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

తప్పక చదవండి
  • 931 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌..!

దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మధ్యాహ్నం వరకు అదే ఊపును కొనసాగించాయి. ఆ తర్వాత అమ్మకాలు పుంజుకోవడంతో చివరి సెషన్‌లో కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 930.88 పతనమై 70,506.31 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 302.90 పాయింట్లు పడిపోయి 21,150.20 పాయింట్ల వద్ద స్థిరపడిరది. దాదాపు 577 షేర్లు పురోగమించగా.. 2,721 షేర్లు పతనమయ్యాయి. 57 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, యూపీఎల్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా అత్యధికంగా నష్టపోయాయి. ఓఎన్‌జీసీ, టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభపడ్డాయి. ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌, మెటల్‌, ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌, రియాల్టీ 2-4 శాతం క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు మూడు శాతానికిపైగా క్షీణించాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు