Sunday, April 28, 2024

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

తప్పక చదవండి
  • 1,053 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌..!

దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు మంగళవారం భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల నేపథ్యంలో ఉదయం స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. 71,868.20 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకులు, మెటల్‌ రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో ఆ తర్వాత సెనెక్స్‌ భారీగా నష్టాల్లోకి వెళ్లింది. ఓ దశలో 72,039.20 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌.. కనిష్ఠంగా 70,234.55 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 1,053.10 పాయింట్లు నష్టపోయి.. 70,370.55 పాయింట్ల వద్ద స్థిరపడిరది. నిఫ్టీ సైతం 333పాయింట్లు పతనమై 21,238.80 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌ మరియు ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అత్యధికంగా నష్టపోయాయి. సిప్లా, సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ లాభపడ్డాయి. సెక్టోరల్‌లో ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు దాదాపు 3శాతం వరకు క్షీణించాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు