Monday, May 6, 2024

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350కు పోటీగా హీరో బైక్‌..

తప్పక చదవండి
  • వచ్చేనెలలో బుకింగ్స్‌

ప్రముఖ టూ వీలర్స్‌ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్‌ మంగళవారం శక్తిమంతమైన, తన ఫ్లాగ్‌షిప్‌ మోటారు సైకిల్‌ ‘హీరో మేవరిక్‌440’ ఆవిష్కరించింది. జైపూర్‌లో జరుగుతున్న ‘హీరో వరల్డ్‌ 2024’ ఈవెంట్‌లో హీరో మేవరిక్‌440తోపాటు ‘హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్‌’ కూడా ఆవిష్కరించింది. హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్‌ మోటారు సైకిల్‌ ధర రూ. 95 వేలు (ఎక్స్‌ షోరూమ్‌) నుంచి ప్రారంభం అవుతుంది.
అయితే హీరో మేవరిక్‌440 బైక్‌ ధర మాత్రం వెల్లడిరచలేదు. ఫిబ్రవరి నుంచి బుకింగ్స్‌ ప్రారంభం అవుతాయి. ఏప్రిల్‌ లో డెలివరీ చేస్తారు. హీరో మేవరిక్‌ 440 మోటారు సైకిల్‌ ధర సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హార్లీ డేవిడ్సన్‌ ఎక్స్‌ 440, జావా 350, హోండా సీబీ350 మోటారు సైకిళ్లతో హీరో మేవరిక్‌ 440 బైక్‌ పోటీ పడుతుంది. ఇక హోండా షైన్‌ 125, హోండా ఎస్పీ 125, టీవీఎస్‌ రైడర్‌ వంటి మోటారు సైకిళ్లతో హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్‌ పోటీ పడుతుంది.
హార్లీ డేవిడ్సన్‌ ఎక్స్‌440 ప్లాట్‌ఫామ్‌పై హీరో మేవరిక్‌440 మోటారు సైకిల్‌ డెవలప్‌ చేశారు. కానీ, ఈ బైక్‌ లుక్స్‌, డిజైన్‌ విభిన్నంగా ఉంటాయి. మోడ్రన్‌ టచ్‌తోపాటు రెట్రో థీమ్‌తో రోడ్‌ స్టర్‌ స్టైల్డ్‌ బైక్‌గా రూపుదిద్దుకున్నది. హెచ్‌-షేప్డ్‌ డీఆర్‌ఎల్‌ తోపాటు రౌండ్‌ హెడ్‌ ల్యాంప్‌, ట్యూబ్‌లర్‌ స్టయిల్‌ హ్యాండిల్‌ బార్‌, సింగిల్‌ పీస్‌ సీట్‌, కర్వ్‌ డ్‌ ఫ్యుయల్‌ ట్యాంక్‌ విత్‌ స్పోర్టీ ట్యాంక్‌ శ్రౌండ్స్‌, శార్ప్‌ లుకింగ్‌ ఎగ్జాస్ట్‌తో ఈ బైక్‌ మరింత శక్తిమంతంగా కనిపిస్తుంది.
మూడు వేరియంట్లలో హీరో మేవరిక్‌440 మోటారు సైకిల్‌ లభిస్తుంది. బేస్‌, మిడ్‌, టాప్‌ వేరియంట్లతోపాటు ఐదు కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. ఆర్కిటిక్‌ వైట్‌, ఫియర్‌లెస్‌ రెడ్‌, సెలెస్టియల్‌ బ్లూ, ఫాంటం బ్లూ, ఎనిగ్మా బ్లాక్‌ కలర్స్‌లో లభిస్తుంది. డ్యుయల్‌ చానెల్‌ ఏబీఎస్‌తోపాటు సింగిల్‌ డిస్క్‌ బ్రేక్స్‌ ఉంటాయి.
సౌకర్యవంతమైన రైడిరగ్‌ కోసం ఫ్రంట్‌లో 130 ఎంఎం ట్రావెల్‌తో 43 ఎంఎం టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, రేర్‌లో డ్యుయల్‌ షాక్‌ అబ్జార్బర్స్‌ ఉంటాయి. రైడర్‌ కంఫర్ట్‌ను ద్రుష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ డిజైన్‌ చేశారు. న్యూట్రల్‌ ఫుట్‌ రెస్ట్‌, 17-అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ వచ్చాయి. మిడ్‌ అండ్‌ టాప్‌ మోడ్‌ వేరియంట్లలో డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌ లభిస్తాయి.
హార్లీ డేవిడ్సన్‌ ఎక్స్‌440 మోటారు సైకిల్‌లో వాడిన ఇంజిన్‌నే స్వల్ప మార్పులతో హీరో మేవరిక్‌ 440లో వినియోగించారు. ఈ ఇంజిన్‌ 440సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌గా ఉంటుంది. ఈ ఇంజిన్‌ గరిష్టంగా 27బీహెచ్పీ విద్యుత్‌ 36 ఎన్‌ఎం టార్క్‌ వెలువరిస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ విత్‌ స్లిప్‌ అండ్‌ అసిస్ట్‌ క్లచ్‌ తో ఇంజిన్‌ రూపుదిద్దుకున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు