- రూ. 9.50 లక్షలను స్వాదీనం చేసుకున్నవికారాబాద్ పోలీసులు
వికారాబాద్ : కోడ్ అమల్లోకి వచ్చిన రోజే నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలో మంగళ వారం ఓ వ్యక్తి కారులో డబ్బులతో వస్తుండగా గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ ఆసిఫ్ నగర్‌కు చెందిన మహమ్మద్ మొహిత్ తన కారు(టీఎస్09 ఎఫ్‌ఏ 2737)లో హైదరాబాద్ నుంచి తాండూరు వైపు వస్తున్నారు. మార్గ మద్యలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్నికల కోడ్ నిబంధనలో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మోహిత్ కారులో రూ. 9.50లక్షలు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమలు ఉండగా ఎవరైనా సరే రూ. 50 వేలకు మించి నగదును కలిగి ఉంటే అందుకు సంబంధించి దృవపత్రాలను చూపించాలని నిబంధన ఉంది. అయితే మొహిత్ వద్ద ఎలాంటి దృవపత్రాలు లేకుండా రూ. 9.50 లక్షలు కలిగి ఉండంతో పోలీసులు వాటిని స్వాదీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా డబ్బులు కలిగి ఉండడంతో పాటు ఎలాంటి దృవపత్రాలు లేనందుకు స్వాదీనం చేసుకున్నట్లు సీఐ టంగుటూరి శ్రీను తెలిపారు. స్వాదీనం చేసుకున్న డబ్బును ఆధాయ పన్ను శాఖకు అప్పగిస్తామని వెల్లడిరచారు. మరోవైపు యజమాని మోహిత్ మాట్లాడుతూ తాండూరులో కారు కొనుగోలు చేసేందుకని డబ్బులు తీసుకవచ్చినట్లు తెలపడం ఆశ్చర్యకరం.