Friday, May 17, 2024

‘‘మీకొడుకు మీ ఇంటిగుమ్మంలో’’

తప్పక చదవండి
  • నీలం మధు ముదిరాజ్‌ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నది స్పష్టం…!
  • ఈ నెల16న పాదయాత్ర ప్రారంభం…
  • సబ్బండ వర్గాలు, ఎన్‌ఎంఆర్‌ యువసేన అనుచరులు,
    నియోజకవర్గ ప్రజల మద్దతులో ముందుకు…

హైదరాబాద్‌ : ఏపార్టీ టికెట్‌ ఇస్తే ఆ కండావాతో ముదిరాజ్‌, సబండ వర్గాలు,ఆత్మగౌరవంగా ముందుకు వెళతాం.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సొంతపార్టీలో ఉండికూడా ఇబ్బంది పెట్టారు, తప్పుడు కేసులు పెట్టించారు. ఇంతవరకూ బీఆర్‌ఎస్‌ నుంచి సానుకూల నిర్ణయం రాలేదని, ఈనెల 16 తేదీ నుంచి గుమ్మదిదల మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రజల మధ్యే పార్టీకి రాజీనామా చేసి పాదయాత్ర చేయబోతున్నట్లు ఎన్‌ఎంఆర్‌ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. చిట్కుల్‌ గ్రామంలో నీలం మధు ముదిరాజ్‌ క్యాంపు కార్యాలయంలో ఎన్‌ఎంఆర్‌ యువసేన, అనుచరలు, సబ్బండ వర్గాల ప్రజలతో సమావేశం నిర్వహించి, విలేకరులు సమావేశంలో మీకొడకు మీఇంటి గుమ్మంలో పాదయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.

గ్రామల్లో ఎన్నో సేవకార్యక్రమాలు చేశానని, మాబిడ్డకి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వలేదని, రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్‌ జాతికి అన్యాయం జరిగింది. బీసీ, సబ్బండ కులాలు నీలం మధు ముదిరాజ్‌ను మేమే స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టుకుని గెలిపించుకుంటామని తెలిపారన్నారు. నీలం ముదిరాజ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నుంచి మాపార్టీలో చేరమని ఫోన్లు చేస్తున్నారని ముదిరాజ్‌ల ఆత్మగౌరవం ముఖ్యమని టికెట్‌ ఖరారుచేసిన రోజు చేరతానని చెప్పానన్నారు. నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని, స్వతంత్రంగా పోటీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఈనెల 16 వతేదీ ఉదయం 10 గంటలకు ఒకటో పోలింగ్‌ బూత్‌ నుంచి ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజల కోరికే మేనిపోస్టోగా మీకొడుకు మీ ఇంటి గుమ్మంలో అనే నినాదంతో పాదయాత్ర చేయబోతున్నట్లు చెప్పారు. గడపగడపకు సమస్య తెలుసుకుని మీ బిడ్డలా గెలిచిన వెంటనే పరిష్కారం వెంటనే చేస్తానని చెప్పారు. తెలంగాణలో 60 లక్షలున్న ముదిరాజ్‌ల ఆత్మగౌరవం మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్నా. 16 ఏళ్ల ఉన్నప్పుడే గులాబీజెండాతో పార్టీని బలోపేతం చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం.

- Advertisement -

నాకు పార్టీ ఏమి ఉపయోగపడిరది అనేదాని కన్నా పార్టీ బలోపేతానికి ఎన్నో కార్యక్రమాలు చేశానన్నారు. సొంత పార్టీలో ఉండి కూడా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నన్ను ఎంతో ఇబ్బంది చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబుల్‌బెడ్‌ రూంలకు వస్తుంటే కట్టిన ప్లెక్సీలను ఎమ్మెల్యే కుమారుడితో చింపించారని తెలిపారు. చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ సమయంలో మూడుసార్లు పోతే ఉన్న లేరని ఎమ్మెల్యే చెప్పించారన్నారు. తప్పుడు కేసులు నమోదు చేయించారన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పిలిచి టికెట్‌ ఇస్తుందని ఆశ ఉండేదని తెలిపారు. ముదిరాజ్‌, సబ్బండ వర్గాల గొంతుగా అసెంబ్లీలో మాట్లాడుకునేలా చేయాలని చెప్పామని, ఇంత వరకూ వేచిచూసామని, పిలవకపోవడంతో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఏపార్టీ అయినా టికెట్‌ ఇస్తానంటే ఆ కండువా కప్పుకుని పోటీచేస్తామని తెలిపారు. మీ బిడ్డనై వస్తున్నా ప్రజాభిప్రాయం మేరకు అభివృద్ధి చేసుకుందాంమన్నారు. ఇప్పటివరకూ పిలుపు ఇవ్వకపోవడంతో భాదాకరం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించలేదన్నారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొల్లూరు మల్లేష్‌, మహేందర్‌ రెడ్డి, సర్పంచులు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, ఎన్‌ఎంఆర్‌ యువసేన కార్యకర్తలు, ప్రజలు, తదితరులు, పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు