Tuesday, May 14, 2024

తెలంగాణలో ప్రచారానికి తెర

తప్పక చదవండి
  • సాయంత్రం 5 గంటలతో ముగిసిన ప్రచారం
  • చివరి రోజు జోరుగా రాజకీయ పార్టీల ప్రచాహోరు
  • పోలింగ్‌ రోజు కార్యాలయాలకు సెలవులు
  • ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు విధిగా సెలవు ఇవ్వాలి
  • ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల అధికారి వికాస్‌ రాజు
  • సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు
  • నగరంలో అమల్లోకి వచ్చిన 144 సెక్షన్‌

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో అంటే.. నవంబర్‌ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని సంస్థలు సెలవు ఇవ్వాని ఆదేశించారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు సీఈవో తెలిపారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్‌ నగరంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. బుధ, గురువారాల్లో జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్‌ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజున అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ఎన్నికలు జరిగే రోజున తెలంగాణలోని అన్ని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని సీఈవో వికాస్‌ రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ కంపెనీలు హాలిడే ప్రకటించాలన్నారు.

సెలవు ఇవ్వని సంస్థలు, కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని ఐటీ, ప్రైవేట్‌ కంపెనీలు సెలవు ఇవ్వలేదని తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల రోజున సంస్థలు సెలవులు ఇవ్వకపోవడంతో ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నవంబర్‌ 30న ఎన్నికల రోజు అన్ని సంస్థలు హాలిడే ఇస్తున్నాయో లేదో పరిశీలించి, సెలవు ఇవ్వని కంపెనీ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు తెలంగాణ సీఈవో వికాస్‌ రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబరు 29, 30 తేదీల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబరు 29న ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. డిసెంబర్‌ 1న మళ్లీ స్కూళ్లు, కాలేజీలూ తెరచుకోనున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. హైదరాబాద్‌ నగరంలో 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చిందని సీపీ సందీప్‌ శాండిల్య తెలపారు. ఎన్నికల ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్‌ ఉంటాయని పేర్కొన్నారు. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలు నిలిపివేస్తూ హైదరాబాద్‌ సీపీ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముగిసేవరకు 144 సెక్షన్‌ కొనసాగుతుందని సీపీ వెల్లడిరచారు. ఐదుగురికి మించి ఎక్కడైనా గుమ్మిగడితే చర్యలు తప్పవని సీపీ తెలిపారు. బార్లు, వైన్‌ షాపులు, పబ్బులు మూసివేయాలని సీపీ ఆదేశాలు ఇచ్చారు. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు