Tuesday, April 30, 2024

రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్‌ ఫోన్లఆవిష్కరణకు ముహూర్తం ఖరారు..

తప్పక చదవండి

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ రెడ్‌మీ తన రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్‌ ఫోన్లను భారత్‌ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. రెడ్‌మీ నోట్‌ 13తోపాటు రెడ్‌మీ నోట్‌ 13 ప్రో, రెడ్‌మీ నోట్‌ 13 ప్రోం పోన్లను కూడా ఆవిష్కరించనున్నది. వచ్చేనెల నాలుగో తేదీన ఆవిష్కరించేందుకు రెడ్‌మీ రంగం సిద్ధం చేసింది. ప్రతి ఒక్కరూ ఈ ఫోన్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు.
ఇవీ రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్‌ ఫోన్ల ధరవరలు.. రెడ్‌మీ నోట్‌ 13 ఫోన్‌ ధర సుమారు రూ.13,900 (1199 చైనా యువాన్లు), రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ఫోన్‌ ధర సుమారు రూ.17,400 (1499 చైనా యువాన్లు), రెడ్‌మీ నోట్‌ 13 ప్రోం ఫోన్‌ ధర దాదాపు రూ.22,800 (1999 చైనా యువాన్లు) పలుకుతాయని భావిస్తున్నారు.
రెడ్‌మీ నోట్‌ 13ప్రో.. రెడ్‌మీ నోట్‌ 13 స్పెషిఫికేషన్స్‌.. రెడ్‌మీ నోట్‌ 13, రెడ్‌మీ నోట్‌ 13 ప్రోం ఫోన్లు 1.5 కే ఫుల్‌ హెచ్డీం 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ ప్లే విత్‌ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటక్షన్‌ ఉంటుంది. రెడ్‌మీ నోట్‌ 13 ప్రోం ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్వోసీ, రెడ్‌మీ నోట్‌ 13 ఫోన్‌ క్వాల్‌ కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌ 2 ఎస్వోసీ చిప్‌ సెట్‌ కలిగి ఉంటాయి.
రెడ్‌మీ నోట్‌ 13 ప్రోం ఫోన్‌ మూడు రెడ్‌మీ నోట్‌ 13 ఫోన్‌ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. రెండు ఫోన్లు 200- మెగా పిక్సెల్‌ శాంసంగ్‌ ఐఎస్‌ఓ సెల్‌ హెచ్పీ3 సెన్సర్‌ విత్‌ ఓఐఎస్‌, 8 మెగా పిక్సెల్‌ ఆల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2 మెగా పిక్సెల్‌ మాక్రో సెన్సర్‌ కెమెరా ఉంటాయి. రెండిరటిలోనూ సెల్ఫీలూ వీడియో కాల్స్‌ కోసం 16 మెగా పిక్సెల్స్‌ కెమెరా, రెడ్‌మీ నోట్‌ 13ప్రో ఫోన్‌లో 16 మెగా పిక్సెల్‌ సెన్సర్‌ కెమెరా ఉంటాయి.
రెడ్‌మీ నోట్‌ 13 ప్రోం ఫోన్‌ 120 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ మద్దతుతో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ఫోన్‌ 67 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ మద్దతుతో 5,100 ఎంఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటాయి. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్‌ 13 బేస్డ్‌ ఎంఐయూఐ 14 ఔటాఫ్‌ బాక్స్‌ వర్షన్‌పై పని చేస్తాయి.
రెడ్‌మీ నోట్‌ 13 ఫోన్‌ స్పెషిఫికేషన్స్‌.. రెడ్‌మీ నోట్‌ 13 ఫోన్‌ 120 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేటుతో 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ ప్లే కలిగి ఉంటుంది. మీడియా టెక్‌ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ 6జీబీ ర్యామ్‌ విత్‌ 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్‌ విత్‌ 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్‌ విత్‌ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్‌ విత్‌ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్లతో వస్తున్నాయి. రెడ్‌మీ నోట్‌ 13 ఫోన్‌ 200 మెగా పిక్సెల్‌ ప్రైమరీ సెన్సర్‌, 2 మెగా పిక్సెల్‌ డెప్త్‌ సెన్సర్‌, సెల్ఫీలూ వీడియో కాల్స్‌ కోసం 16 మెగా పిక్సెల్స్‌ సెన్సర్‌ కెమెరా ఉంటాయి. 33 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ మద్దతుతో 5000 ఎంఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 బేస్డ్‌ ఎంఐయూఐ 14 ఔటాఫ్‌ బాక్స్‌ వర్షన్‌పై పని చేస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు