Wednesday, May 8, 2024

రాష్ట్రంలో సమాచార హక్కు కమిషనర్‌లను నియమించాలి

తప్పక చదవండి

సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటిది. పాలనలో పారదర్శకత పెంచి, అవినీతిని నిర్మూలనకు బీజం వేసి, జవాబుదారీ తనం పెంచే ఈ చట్టం అమలులోకి వచ్చి సుమారు 18 సంవత్సరాలు అవుతూ వున్నది. కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వం, సమాచార కమిషనర్‌ పోస్టులను భర్తీ చేయాలి. గత ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించడం లో పూర్తిగా విఫలం అయినది. భారత ప్రభుత్వం అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలనే తాపత్రయంతో అప్పటి యు.పి.యే ప్రభుత్వం గొప్ప చట్టమయిన సమాచార హక్కు చట్టం ని అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కి సంబంధించిన ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి అందుబాటులో వుంటారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో తప్పక సమాచార బోర్డ్‌ లు వుండాలి. ప్రజలు వివిధ సమాచారం కోరుతూ అధికారులకు దరఖాస్తు చేస్తే నెల రోజుల లోపు సమాచారం ఇవ్వాలిసి వున్నా ఏదో ఒక వంక తో ధరఖాస్తుదారులకు తిప్పి పంపడం, లేదా సమాచారం లేదని చెప్పడం, సమాచారానికి ఇన్ని పేజీలు అంటూ రుసుం వసూలు చేయడం జరుగుతుంది.కొన్ని కార్యాలయాలలో రెండు,మూడు,ఆరు నెలలు కూడా గడిచిన సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినవస్తూ వున్నాయి.మొదటి అప్పీలు కి వెళ్లినా స్పందన లేదు. రెండవ అప్పీల్‌ చేసీనా కమిషన్‌ లేక పోవడం వల్ల చట్టం పూర్తిగా నీరు గారి పోయింది..ఇప్పటికే లక్ష లాది రెండవ అప్పీల్లు పెండిరగులో వున్నాయని తెలుస్తూ వుంది. గతం లో వున్న రాస్ట్ర సమాచార కమీషన్‌ ఒక్క జిల్లాలో కూడా పర్యటించిన దాఖలాలు లేవు.జిల్లా పాలన అధికారులు తమ జిల్లా అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాల లో కూడా సమాచార హక్కు చట్టం అమలు తీరు మీద చర్చించిన ఆనవాళ్లు కూడా లేవు.అధికారులకు ఈ చట్టం గూర్చి పూర్తి అవగాహన లేదు.కొన్ని జిల్లాలలో సమాచార హక్కు చట్టం కార్యకర్త లమీద దాడులు చేయడము,భయభ్రాంతులకు గురిచేయడం జరుగుతూ వుంది.దేశ వ్యాప్తంగా సహ చట్టం ఉద్యమకారుల మీద దాడులు జరుగుతూ వున్నాయి.అనేక మందిని పొట్టన పెట్టు కున్న ఉదంతాలూ వున్నాయి.సమాచారం కోసం ధరకాస్తూ చేస్తే అధికారులు సమాచారం ఇవ్వకుండా ధరఖాస్తుదారులు తమను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వున్నారని అసత్య ఆరోపణలు చేసి కేసులు పెట్టిన సందర్భాలు గలవు.అన్ని రాష్ట్రాలలో ఈ చట్టం పకట్బంధీగా అమలు అవుతూంది. మన రాష్ట్రంలో చట్టం అమలు లోప బూయిస్టముగా వుంది.వివిధ పథకాల అమలు తీరు గూర్చి సమాచారం కావాలని దరకాస్తు చేసిన వారికి అధికారులు వారి ధరకాస్తును తిప్పి పంపడం,ఈ సమాచారం మేము ఇవ్వడానికి వీ లు కాదు అంటూ నిరాకరణ చేస్తూ వున్నారు.ఒక్క రోజు కూడా జిల్లా స్థాయి అధికారులతో సమాచార హక్కు చట్టం అమలు తీరు గూర్చి సమీక్ష సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు.కావాలనే ఈ చట్టం ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వుందనే ఆరోపణలు విన వచ్చాయి.గ్రామ,మండల పరిధిలోని అధికారులు కూడ ధరకాస్తు దారులను ఇబ్బంది పెట్టడం, మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు ధరకాస్తు దారులను బెదిరించడం జరుగుతూ వుంది.మీరు మమ్ములను సమాచారం అడిగే వారు అయ్యారా అంటూ కొన్ని సార్లు దాడులు చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇకనయిన నూతన ప్రభుత్వం స్పందించి మన రాష్ట్రం లో సమాచార హక్కు చట్టం ని పారదర్శకంగా అమలు చెయ్యాలి అని మనవి.అధికారులకు,ప్రజలకు చట్టం మీద శిక్షణ ఇవ్వాలి.కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే సమీక్ష సమావేశం నిర్వహించి మన రాష్ట్రంలో ఈ చట్టం పకట్భందీ గా అమలు చేయడానికి కృషి చేయాలి. నిర్ణీత గడువు లోగా ఎలాంటి షరతులు లేకుండా ఆయా శాఖల అధికారులు అడిగిన సమాచారం ఇవ్వాలి.అన్ని జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ప్రదర్శించాలి. పాలనలో పారదర్శకత జవాబుదారీతనం ను పెంచి అవినీతి నీ అరికట్టాలి.తక్షణమే నూతన ప్రధాన సమాచార కమిషనర్ను మరియు కమిషనర్లను నియమించాలి.సహ చట్టంను బలోపేతం చేయాలని సహ చట్టం ఉద్యమ కారులు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్య మంత్రి, క్యాబినెట్‌ మంత్రులు ఈ విషయం మీద స్పందించాలి.
కామిడి సతీష్‌ రెడ్డి,
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా. 9848445134.
తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు