Sunday, May 5, 2024

సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణ స్వీకారం..!

తప్పక చదవండి
  • 64 మంది ఎమ్మెల్యేలలో 42 మంది రేవంత్ రెడ్డికి ఓటు!
  • మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు టీపీసీసీ చీఫ్ వైపు మొగ్గు
  • దీనిని పరిగణనలోకి తీసుకొని రేవంత్ పేరును ప్రకటించే అవకాశం

తెలంగాణలో కొత్త సీఎం అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. అయితే.. నిన్నటి నుంచి జరుగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈరోజు ఉదయం.. తెలంగాణ సీఎం అభ్యర్థి ప్రకటనపై మళ్లిఖార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రంలోపు తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు సీఎం రేసులో ఉన్న టీ కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. దీంతో తెలంగాణ నెక్ట్స్ సీఎం ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే.. సీఎంగా రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగానే తెలుస్తోంది. రేవంత్ పేరును అటు ఎమ్మెల్యేలు బలపర్చగా.. ఇటు అధిష్ఠానం కూడా ఆయనవైపే మొగ్గు చూపించింది. అయితే.. సీఎం రేసులో ఉన్న కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకించటంతో.. అధికారిక ప్రకటన ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కర్ణాటక డిప్యూటీ సీఎం, తెలంగాణ పరిశీలకుడు డీకే శివ కుమార్‌తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. డీకే సోదరుడి నివాసంలో ఆయన్ను కలిశారు. సీఎం రేసులో ఉత్తమ్ కూడా ఉండగా.. డీకేతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. ఖర్గే నివాసంలో రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్ భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించటంతో పాటు ఆయనను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే.. మిగతా సీనియర్లు నేతలు చేస్తున్న డిమాండ్లపై చర్చించినట్టు సమాచారం. సమావేశం అనంతరం.. డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే, కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు బయలుదేరారు.

అగ్రనేతల భేటీ అనంతరం.. తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. సాయంత్రంలోపు ఏ క్షణంలోనైనా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక.. రేవంత్ రెడ్డి డిసెంబరు 7న ప్రమాణం స్వీకారం చేస్తారని.. ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావటమే తరువాయిగా మారింది. కాగా.. ఇప్పటికే అటు కాంగ్రెస్ శ్రేణులతో పాటు, అధికారులు కూడా కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది.
నేనూ రేసులో ఉన్నా..
తెలంగాణ సీఎం పదవి రేసులో తాను కూడా ఉన్నట్లు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు. సీఎం పదవిని ముగ్గు నలుగురు ఆశించడంలో తప్పు ఏంటని ఢిల్లీలో ఉత్తమ్ ప్రశ్నించారు. సీఎం ఎంపిక విషయంలో పార్టీ హైకమాండ్‌ సరైన పద్ధతి పాటిస్తోందని వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు