Tuesday, October 15, 2024
spot_img

ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు సిద్ధమా : బండి సంజయ్‌

తప్పక చదవండి

కరీంనగర్‌ : మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. గంగులను ఎందుకు గెలిపించాలని ప్రశ్నల వర్షం కురిపించారు. అవినీతిపరులు ఎవరో తేల్చుకుందామని.. ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు సిద్ధమా అంటూ బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. ‘‘గంగుల? నిన్నెందుకు గెలిపించాలి. రేషన్‌ మంత్రివి.. ఒక్క రేషన్‌ కార్డు అయినా ఇచ్చావా? బీసీ మంత్రివి? ఎంత మందికి బీసీ బంధు ఇచ్చినవ్‌? వడ్ల మంత్రివి? తాలు, కటింగ్‌ పేరుతో క్వింటాలుకు 10 కిలోలు దోచుకుంటావా? పంట నష్టపోతే పరిహారం ఎందుకివ్వలేదు? 15 ఏళ్లుగా ఎమ్మెల్యేవి.. పేదలకు ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? సిగ్గు లేకుండా పేదల ఇండ్లను కూల్చివేయిస్తావా? ఎంపీగా కరీంనగర్‌ అభివ్రుద్ధి కోసం నేను తెచ్చిన నిధులివిగో.. అవినీతిపరులు ఎవరో తేల్చుకుందామా?.. ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు సిద్ధమా?’’ అంటూ బీజేపీ నేత ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. వరికి మద్దతు ధర రూ.3100 ఇస్తామని బండి సంజయ్‌ హావిూ ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు