Sunday, May 19, 2024

బెల్లంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వినోద్‌ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు

తప్పక చదవండి

హైదరాబాద్‌ : బెల్లంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వినోద్‌ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు జరగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం ఆయన సోదరుడు మాజీ ఎంపీ, చెన్నూరు అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ నివాసంలో కూడా ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో సోదరులిద్దరిపై సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. వివేక్‌ నివాసంలో దాదాపు నాలుగున్నర గంటల పాటు సోదాలు జరిగాయి. ఈ నెల 13న ఫ్రీజ్‌ చేసిన రూ.8 కోట్ల నగదుపై ఐటీ ఆరా తీసింది. అయితే వివేక్‌ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈడీ అధికారులు వెళ్లిపోయారు. ఇంట్లో ఎలాంటి డాక్యుమెంట్లు, నగదును కూడా అధికారులు సీజ్‌ చేయనట్లు తెలుస్తోంది. అటు మంచిర్యాలలో ఈడీ, ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే.. షాదన్‌ కాలేజ్‌లో పనిచేస్తున్న ఇక్బాల్‌ అహ్మద్‌ నివాసంలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌12 లో సోదాలు కొనసాగుతున్నాయి. కొమురంభీం జిల్లాలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్‌లో పలువురు వ్యాపారవేత్తల ఇళ్లల్లో ఐటీ తనిఖీలు జరుపుతోంది. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు