Friday, May 3, 2024

రంగారెడ్డి జిల్లా రిజిస్టార్‌ కార్యాలయంలో దొంగతనాలేంటి?

తప్పక చదవండి
  • చుట్టూ నిఘా నేత్రాలు ఉన్న దొంగతనం ఎలా జరిగిందో?
  • దొంగతనం జరగడంలో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా!
  • ప్రజల ఆస్తులకు ప్రభుత్వ రక్షణపై పలు అనుమానాలు
  • విచారణ చేపట్టని ఉన్నతాధికారుల పాత్రపై సర్వత్ర విమర్శలు
  • జిల్లా రిజిస్టార్లు, సబ్‌ రిజిస్టార్ల అవినీతిపై ఆదాబ్‌ పత్రికలో కథనాలు
  • అయినా స్పందించని ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
  • కేసుల నుంచి తప్పించుకోవడానికి దొంగతనం నాటకాల! అనుమానం వ్యక్తం చేస్తున్న బాధితులు
  • ఇప్పటికే పలు కార్యాలయాల్లో విలువైన పత్రాలుమాయమైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజలు

రంగారెడ్డి జిల్లా రిజిస్టార్‌ కార్యాలయం కూకట్‌పల్లిలో గురువారం దొంగలు పడ్డారంటూ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చుట్టూ నిఘా నేత్రాలు ఉన్న దొంగలు ఎలా పడ్డారో అర్థం కావడం లేదు. గతవారం రంగారెడ్డి జిల్లా రిజిస్టార్‌ స్థిత ప్రజ్ఞ్యపై హయత్‌ నగర్‌ సబ్‌ రిజిస్టార్‌ శ్రీనివాస్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి లపై కేసులు నమోదైనవిషయంతెలిసిందే జిల్లా రిజిస్టర్‌ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల్లో ఎంతో అవినీతి జరుగుతోందని దానిని నిలవరించడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారని అపవాదు కూడా ఉన్నది. కానీ నేడు దొంగతనం అనే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అవినీతిపై పత్రికల్లో కథనాలు వచ్చిన అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్టు ఉండడం చూస్తుంటే ఇందులో ఎవరి పాత్ర ఏంటో అర్థం కాని పరిస్థితి ఒక బాధితుడు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో కేసులు నమోదు చేశారు. మరి గురువారం జరిగిన దొంగతనంపై పోలీసులు విచారణ చేపట్టి ఏం తెలుస్తారో చూడాలి. ఇలా అయితే ప్రజలు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆస్తులకు ప్రభుత్వానికి లక్షల్లో పన్ను కడతారు.

మరి ప్రభుత్వం వారి ఆస్తులను ఎలా కాపాడుతుందో ఎలా రక్షిస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిరది. కొంతమంది అవినీతి అధికారుల మూలాన సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరి నీ విచారిస్తామని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయినా కూడా రిజిస్టార్‌ కార్యాలయాల్లో అవినీతి మాత్రం ఆగడం లేదు. అంటే వీరికి ప్రభుత్వం అంటే లెక్కే లేదు. అలవాటు పడ్డ ప్రాణం కదా అందుకే అవినీతిని కొనసాగిస్తున్నారేమో? ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది అవినీతి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా రిజిస్టార్లు సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల్లో విలువైన పత్రాలు మాయమయ్యని ప్రజల కు అనుమానాలు మొదలయ్యాయి. కొంతమంది అధికారులు విలువైన డాక్యుమెంట్లు మాయం చేసి దొంగతనం పేరుతో బయటపడే అవకాశాలను వెతుక్కుంటున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అవినీతి అధికారుల భరతం పట్టి భరోసా కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు