Friday, May 3, 2024

టాలెంట్‌ స్కూల్‌లో అనుమతి లేని విద్యా..

తప్పక చదవండి
  • అనుమతులు ఉన్నది 8వ తరగతి వరకే..
  • చదువు చెప్తున్నది 9వ, 10వ తరగతి విద్యార్థులకు..
  • మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు..
  • మా అన్న కౌన్సిలర్‌ అంటూ బెదిరింపులకు దిగుతున్న పాఠశాల నిర్వాహకుడు..
  • ఒక్క విద్యార్థి నుండి వేలల్లో అక్రమ ‘‘ఫీజు’’వసూళ్లు..

అనుమతులు లేకున్నా అత్యున్నత విద్యను అందిస్తామంటూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్‌ పాఠశాల నిర్వాహకుడు 9,10వ తరగతి విద్యార్థుల నుండి ట్యూషన్‌ పేరుతో, వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. వివరాలలోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్‌ సింగ్‌ నగర్‌ లో ఉన్న ఎస్‌.ఎల్‌.కె టాలెంట్‌ స్కూల్‌ నిర్వాహకులు, సంబంధిత శాఖ అధికారుల నుండి తీసుకున్న అరమతులు ఎనిమిదో తరగతి వరకే అని అధికారులు చెప్తున్నారు.పాఠశాలలో ప్రస్తుతం 9వ, 10వ తరగతి విద్యార్థులకు సైతం క్లాసులు నిర్వహిస్తున్నారు.ఈ తతంగమంతా గత కొన్ని నెలలుగా జరుగుతున్నప్పటికీ, సంబంధిత శాఖ అధికారులకు తెలిసినప్పటికీ, పాఠశాల నిర్వాహకుడు వద్ద ముడుపులు తీసుకుని మౌనంగా ఉండి పోయారనే పలువురు ఆరోపిస్తున్నారు.ఈ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు.


విద్యార్థులకు ట్యూషన్‌ పేరుతో నిలువు దోపిడి ..
భగత్‌ సింగ్‌ నగర్‌ లోని ఎస్‌.ఎల్‌.కె టాలెంట్‌ స్కూల్‌ లో సంబంధిత శాఖ నుండి అనుమతులు పొందిన క్లాసులకు కాకుండా, 9వ, 10వ తరగతి విద్యార్థులకు గత కొన్ని నెలలుగా క్లాసులు నిర్వహిస్తూ వస్తున్నారు.ఈ విషయంపై అధికారులు కానీ, విద్యార్థి సంఘాల నాయకులు కానీ పాఠశాలకు గురించి ఎవరైనా ఎంక్వయిరీ చేస్తున్నట్లు యాజమాన్యానికి తెలిస్తే, 8వ తరగతి వరకే స్కూల్లో ఉందని,అదనపు తరగతి లు ఇక్కడ లేదని చెప్పాలని నిర్వాహకులు విద్యార్థులకు చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎస్‌.ఎల్‌.కె పాఠశాలలో 9వ తరగతికి సంబంధించి 15 మంది విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తుండగా, పదో తరగతి చదువుతున్న వారు 30 మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారని తెలుస్తుంది.వీరంతా నూతనకల్‌ లోని ఓ పాఠశాలలో అడ్మిషన్‌ పొంది, చదువు అయిపోయాక తీసుకువెళ్లే సర్టిఫికెట్స్‌ అన్ని కూడా,అడ్మిషన్‌ వేసిన పాఠశాల పేరుతో ఇస్తుండడం గమనార్హం.ఎస్‌.ఎల్‌.కె టాలెంట్‌ స్కూల్‌ లో తొమ్మిదవ పదవ తరగతులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఇక్కడ వారు కాదని, వారు ట్యూషన్‌ చెప్పించుకోవడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చారని, యాజమాన్యం చెప్పడం పలు అనుమానాలకు తాగిస్తుంది. 9వ తరగతి (ఒక్కో) విద్యార్థి నుండి రూ.30 వేలు పైగా వసూలు చేస్తుండగా పదో తరగతి విద్యార్థుల నుండి రూ.40 వేలకు పైగా ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -


అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్న పాఠశాల యాజమాన్యం…
పాఠశాల నిర్వాహకుడు (అన్న) వదిన గతంలో అధికార పార్టీ కౌన్సిలర్‌ గా ఉన్నారు. మాజీ మంత్రి (ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే) జగదీష్‌ రెడ్డి పేరు చెప్పి, అధికారులను సైతం బెదిరింపులకు గురి చేస్తూ, నిబంధనలకు తుంగలో తొక్కి, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు.ఈ విద్యార్థులు ఒక పాఠశాలల్లో అడ్మిషన్‌ పొంది, ఎస్‌.ఎల్‌.కె టాలెంట్‌ స్కూల్‌ లో విద్యను అభ్యసించడం మిగతా విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నారు.ఈ పాఠశాలకి తనిఖీకి వెళ్లేందుకు కూడా జిల్లా అధికారుల సైతం జంకుతున్నారు.ఆ పాఠశాల నిర్వహకుడికి సంబందితశాఖ అధికారులు వత్తాసు పలుతున్నరని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు.గత కొన్ని నెలలుగా ఈ తతంగం జరుగుతున్నప్పటికీ, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పట్టణ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రానున్న పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని,ఈ పాఠశాలలో విద్యార్థులను అడ్మిషన్‌ పొందిన పాఠశాలకి పంపించి, ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.ఈ పాఠశాలపై అధికారులు తనిఖీలు నిర్వహించి, చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు