Sunday, July 21, 2024

సినిమా వాళ్ళకే సినిమా చూపుతున్న రో హౌస్‌..

తప్పక చదవండి
  • సర్వేనెంబర్‌ 246/1 లో 67 ఎకరాల 17 గుంటలు నిర్మాణాలు..
  • చిత్రపురి విచిత్ర పురిగా మారిన వైనం…
  • 223 మంది మెప్పుకోసం 4367 మంది బలి…

మణికొండ జగిర్‌ లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి సినిమా కార్మికుల కోసం సర్వే నంబర్‌ 46 లో 67 ఎకరాల 17 గుంటల భూమి అలర్ట్‌ చేయ గా జి.ఓ నెంబర్‌ 658/94 1536 హెచ్‌ ఎం డి ఏ ఫర్మేషన్‌ ఇవ్వగా 2250 నిర్మాణాలు చెప్పట్టారు. సినిమా లో పెద్దలు సినిమా వాళ్ళకే సినిమా చూపుతూ సినిమా మొదలు పెట్టారు. నిజమైన లబ్దిదారులకు ఫలం అందకుండా ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, యూకే లో ఉన్న వారికి సినిమా యూనియన్‌ కార్డులు అమ్ముకొని నిర్మాతలు డైరెక్టర్లు గా చూపుతూ వారికి యూనియన్‌ కార్డు లు అప్పజెప్పి వారి వారికి రో హౌస్‌ లో అలర్ట్‌ మెంట్‌ చేపించి కాసులు దొబ్బడం మొదలు పెట్టి రావణకాష్టం మొదలు పెట్టారు. రగులు తున్న కాష్ఠం చల్లారకుండా కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు నిజమైన కార్మికులు రోడ్డు మీద ఉండగా ఎనబై శాతం మంది సినిమా అంటే తెలియని వారు చిత్రపురిలో తిష్ట వేశారు.

గత ప్రభుత్వ పెద్దల పెత్తన దారుల మనుషులు సినిమా కార్మికుల పేద కళాకారుల గూడు గుంజుకొని బాజాప్త తిష్ట వేశారు. నిజమైన కార్మికులు కలర్‌ లు వేసుకొని జానెడు పొట్ట కోసం సాహసాలు చేస్తూ సినిమాలు పండిస్తున్నారు. అలాంటి కార్మికుల కష్టాలు, కన్నీళ్లు పట్టించుకొని సినీ పెద్దలు రో హజ్‌ లు నిర్మాణాలు చేసుకొని 226 మంది ఆనంద చూడడానికి 4365 మంది కన్నీళ్లు పెట్టిస్తున్న వైనం. సినిమా తెరపై నవ్వులు పూయిస్తున్న వారి తెర వెనుక కష్టాలు వర్ణాతిదంగా ఉన్నాయి. కార్మికులు ఇకనైనా ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ నాయకులు చేసిన అవకతవకలు వెలికితీసి అవినీతి కి పాలు పడిన అధికారులపై చర్యలు తీసుకొని సమగ్ర విచారణ జరిపించాలని చిత్రపురిలో 67 ఎకరాల్లో అవకతవకలు గుర్తించి దొంగ కార్డులు తీసుకున్న వారిపై, ఇచ్చిన వారిపై చర్యలు తీసుకొని రో హౌస్‌ లు కూల్చి వేసి నిజమైన 4213 మంది లబ్దిదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని నిలువనీడ లేని నిరుపేద కార్మికులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు