Tuesday, October 15, 2024
spot_img

హ్యాట్రిక్‌ విజయం కొట్టిన రాజాసింగ్‌

తప్పక చదవండి
  • ఓడించేందుకు బిఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నాలు విఫలం
  • అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన వారు అనేకులు..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించారు. రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించి రికార్డు సాధించారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా రాజాసింగ్‌ గెలుస్తు వస్తున్నారు. 2021లో రాజాసింగ్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం సస్పెన్షన్‌ విధించింది. ఈ ఎన్నికల ముందు రాజాసింగ్‌పై బీజేపీ నాయ కత్వం సస్పెన్షన్‌ ఎత్తేసిన విషయం తెలసిందే. రాజాసింగ్‌ను ఓడిస్తామని కెటిఆర్‌ పట్టుబట్టి ప్రచారం చేశారు. అయినా ఆయన గెలుపును ఆపలేకపోయారు. ఇదిలావుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరింది. ఫలితాలు ఒక్కొ క్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి తొలిసారిగా పలువురు అసెంబ్లీకి అడుగుపెడు తున్నారు. పాలకుర్తిలో యశస్విని రెడ్డి, మెదక్‌లో మైనంపల్లి రోహిత్‌ రావు, వేములవాడలో ఆదిశ్రీనివాస్‌, రామగుండంలో రాజ్‌ ఠాగూర్‌, కంటోన్మెంట్‌లో లాస్య నందిత, నాగార్జున సాగర్‌ లో కుందూరు జయవీర్‌ రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి, ఎల్లారెడ్డిలో కే.మదన్‌మోహన్‌ రావు, మందుల సామేల్‌, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌ రెడ్డి, నారాయణ్‌పేట్‌లో పర్నికా రెడ్డి, వరంగల్‌ పశ్చిమ నాయిని రాజేందర్‌ రెడ్డి, వర్ధన్నపేట కేఆర్‌ నాగరాజు తొలిసారిగా అసెంబ్లీలో ప్రవేశిస్తు న్నారు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌ రెడ్డి, చెన్నూరులో ఎంపీ వివేక్‌, కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆలేరు బీర్ల అయిలయ్య, పాలేరు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మొద టిసారిగా ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇదిలావుంటే మేడ్చల్‌ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ భారత్‌ రాష్ట్ర సమితి విజయ దుందుబి మోగించింది. పార్లమెంట్‌ పరిధిలో మల్కాజ్‌గిరి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, మేడ్చల్‌ నియో జకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయకేతనం ఎగుర వేశారు. మల్కాజ్‌గిరి నియోజక వర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఉప్పల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి పరమేశ్వర్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపొందారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేపీ వివేకానంద ఘన విజయం సాధించారు. సవిూప ప్రత్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై 85,576 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీశైలం గౌడ్‌కు 1,02,423 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్‌ మూడోస్థానానికి పరిమి తమైంది. కాంగ్రెస్‌ అభ్యర్థి కోలన్‌ హన్మంత్‌రెడ్డి 1,01,554 ఓట్లు వచ్చాయి. కూకట్‌పల్లి నియోజకవర్గం లో బీఆర్‌ఎస్‌ సైతం మాధ వరం కృష్ణారావు విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి బండి రమేశ్‌పై గెలుపొందారు. ఎల్‌బీ నగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. సవిూప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై ఆయన విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్‌ మూడోస్థానానికే పరిమిత మయ్యారు. మేడ్చల్‌ నియోజకవర్గంలోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జానయ్య యాదవ్‌పై మల్లారెడ్డి 33,419 ఓట్ల తేడాతో గెలుపొందారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గాలి వీచినా.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఒక్క స్థానంలో గెలువకపోవడం గమనార్హం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు